మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిపారు చిత్ర బృందం. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆచార్య కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ సినిమా టికెట్ ధర పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతించింది. పదిరోజుల పాటు రూ.50 పెంచుకునేందుకు అంగీకరించింది. సినిమా నిర్మాణ బడ్జెట్ రూ.100 కోట్లు దాటిన నేపథ్యంలో రేట్లు పెంచుకునే వేసులు బాటు ఇచ్చింది. అయితే ఐదో షో విషయంలో మాత్రం ఇంక స్పష్టత ఇవ్వలేదు.ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ వెసులుబాటు కల్పిస్తోంది.
మరోపక్క తెలంగాణ సర్కార్ సైతం ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆటకు అనుమతి మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏడు రోజుల పాటు రోజుకు 5 ఆటల చొప్పున ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. సినిమా హాళ్లలో ఆయా కేటగిరీలను బట్టి టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఆచార్య సినిమా టికెట్ ధర విషయంలో కీలక జీవో విడుదల చేసింది. ఈ ప్రకటన తో చిత్ర యూనిట్ తో పాటు మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆచార్య సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.