టాలీవుడ్ కు సిరివెన్నెల అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిరివెన్నెల కుటుంబానికి ఇంటి స్థలాన్ని కేటాయించింది. విశాఖపట్టణంలోని వుడా లే అవుట్ లో సిరివెన్నెల కుటుంబానికి 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ.. జీవో జారీ చేసింది.
తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతీ ప్రేక్షకుడిని తన పాటలతో ఓలలాడించారు దివంగత ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. టాలీవుడ్ కు సిరివెన్నెల అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిరివెన్నెల కుటుంబానికి ఇంటి స్థలాన్ని కేటాయించింది. కాగా సీతారామశాస్త్రి వైద్యానికి అయిన ఖర్చులను సైతం ఏపీ ప్రభుత్వం చెల్లించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా విశాఖపట్టణంలోని వుడా లే అవుట్ లో సిరివెన్నెల కుటుంబానికి 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ.. జీవో జారీ చేసింది. త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించబోతున్న నేపథ్యంలో సిరివెన్నెలకు ప్రభుత్వం విశాఖలో స్థలం కేటాయించడం పరిశ్రమలో ఆసక్తిగామారింది.
ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫ్యామిలీకి ఏపీ ప్రభుత్వం 500 గజాల ఇంటి స్థలాన్నికేటాయించింది. విశాఖపట్టణంలోని బీచ్ కు ఆనుకుని ఉన్నవుడా లే అవుట్ లో ఈ స్థలాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత అధికారుల కోసం ప్రత్యేకంగా ఈ లే అవుట్ ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే విశాఖపట్టణం పరిపాలనా రాజధానిగా అవతరించబోతున్న నేపథ్యంలో ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలోనే సిరివెన్నెల జన్మించారు. అదీకాక సిరివెన్నెల సోదరులంతా విశాఖలోనే స్థిరపడ్డారు. ఇక విశాఖతో, అనకాపల్లితో సీతారామశాస్త్రికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దాంతో ఆయన జ్ఞాపకార్ధం విశాఖలో ఇంటి స్థలం కేటాయించారు. కాగా ఇప్పటికే విశాఖలో ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సినీ పెద్దలను కోరిన సంగతి తెసిందే. ప్రభుత్వం తరపున అన్నిప్రోత్సాహకాలు ఉంటాయని జగన్ హామీ ఇచ్చారు కూడా. ఈ నేపథ్యంలో సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.