ఏపీలో సినిమా టికెట్ల రేట్లు చుట్టూ ఏర్పడిన గందరగోళం అందరికి తెలిసిందే. టికెట్ల రేట్లు సామాన్యులకి కూడా అందుబాటులో ఉండాలి అన్నది ప్రభుత్వ వాదన. ఈ రేట్లతో సినిమాలు రిలీజ్ చేయడం అసాధ్యం అన్నది నిర్మాతల వాదన. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అప్పట్లో ఓ కమిటీని వేసింది. సినిమా టికెట్స్ రేట్లు పెంచాలా? లేక జీవో ప్రకారం తగ్గించిన ఈ రేట్లనే కొనసాగించాలా అన్నది ఈ కమిటీ తేల్చాల్సి ఉంది. అయితే.., ఈ రిపోర్ట్ ఇప్పటికే పూర్తి అయ్యి.., సీఎం జగన్ వద్దకి చేరినట్టు తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం కమిటీ రిపోర్ట్ టాలీవుడ్ కి అనుకూలంగా వచ్చిందట.
చదవండి: CM జగన్ విషయంలో అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీల్లో ఉన్న థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచకపోతే.. సినిమాల పరిస్థితి ప్రశ్నార్ధకం కానుందని కమిటీ అభిప్రాయ పడిందట. నాన్ ఏసీ థియేటర్లలో కనీస ధర 30 రూపాయలు, గరిష్ట ధర 70 రూపాయలకు పెంచాలని కమిటీ తేల్చిందట. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 35 తో పోలిస్తే ఈ రేట్లు చాలా అధికంగా ఉన్నాయి.
ఇక ఏసీ సినిమా హాళ్లలో కూడా రేట్లు కూడా పెంచాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. ఏసీ థియేటర్‌లో కనీసం 40 రూపాయలు, గరిష్టంగా 150 రూపాయలు పెంచుకునేలా పర్మిషన్ ఇవ్వాలని కమిటీ నివేదికలో పేర్కొందట. కానీ.., మల్టిప్లెక్సుల్లోని టికెట్ల రేట్లని సవరించాల్సిన అవసరం లేదని కమిటీ తేల్చినట్టు తెలుస్తోంది. ఈ గురువారం ఏపీ సీఎం జగన్ తో ఇండస్ట్రీ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ రిపోర్ట్ లీకులు రావడం చూస్తుంటే.. సీఎం జగన్ టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.