పవన్ కల్యాణ్ అభిమానులకు ఏపీ సర్కారు తీపి కబురు చెప్పింది. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ విషయంలో సానుకూలంగా స్పందిస్తోంది. ఆక్రమంలో ఇప్పటికే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలు పవన్ కల్యాణ్ కు బాగా కలిసొస్తాయని అభిమానులు సంబర పడుతున్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వకీల్ సాబ్ చిత్రానికి నష్టాలు తప్పలేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. సరిగ్గా భీమ్లానాయక్ సినిమా రిలీజ్ కు వారం ముందు ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేశారు. తాజాగా 100 శాతం సామర్థ్యంతో థియేటర్లలో సినిమా విడుదలకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం భీమ్లానాయక్ సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. అంతే కాకుండా భీమ్లానాయక్ రిలీజ్ కు ముందే టికెట్ రేట్లు కూడా ఫైనల్ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. ఆ విషయం కూడా పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏపీ సర్కారు నిర్ణయం పవన్ సినిమాకు కలిసొచ్చే అంశమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.