మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఇది. సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ జోరు పెంచేశాయి. ఇప్పటికే సినిమా బృందం విడుదల చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
మెగా ఫ్యాన్స్ కు ఇంకో కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే.. ఏప్రిల్ 23న విజయవాడలో ఆచార్య సినిమా మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఏపీ ప్రజలకు కిక్ ఇచ్చే ఇంకో న్యూస్ ఏంటంటే.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్ రాబోతున్నారు. చిరంజీవి ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చేందుకు జగన్ ఓకే చెప్పారు. ఇలాంటి సినిమా కార్యక్రమాలకు జగన్ హాజరు కావడం ఇదే ప్రథమం కావడం మరో విశేషం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్స్ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జగన్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
AP CM @ysjagan As The Chief Guest For @KChiruTweets’ #Acharya Pre-Release Event To Be Held In Vijayawada On April 23rd.#YSJagan #Chiranjeevi#AcharyaPreReleaseEvent pic.twitter.com/Fz8ECcgDYe
— Sreedhar Marati (@SreedharSri4u) April 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.