ఏపీలో ఇటీవల మూతపడిన సినిమా థియేటర్లను తిరిగి పునః ప్రారంభించేందుకు జగన్ ప్రభుత్వం అనుమతించింది. మొన్నటివరకు వివిధ కారణాలతో ఏపీ అధికారులు సీజ్ చేసిన అన్ని థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే నెల రోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలనే షరతుతో అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తుంది. థియేటర్లలో తనిఖీల అనంతరం ఇచ్చిన నోటీసులలో పేర్కొన్న షరతులను సరిచేసుకొని అన్ని వసతులను ఏర్పాటు చేస్తేనే తెరుచుకోనున్న థియేటర్ల లైసెన్సులు పునరుద్దరిస్తామని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో వసతుల విషయం పై జగన్ ప్రభుత్వానికి, థియేటర్ల యాజమాన్యాలకు మధ్య భారీ చర్చలే జరిగాయి. కొన్నిచోట్ల టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం పై నిరసన తెలుపుతూ థియేటర్లు మూతపడ్డాయి. అదే విధంగా సినిమా థియేటర్లలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రభుత్వం పలు థియేటర్లను మూసివేసింది. 9 జిల్లాల పరిధిలో 83 థియేటర్లు సీజ్ అయినట్లు తెలుస్తుంది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సీజ్ చేసిన థియేటర్ల యాజమాన్యాలు తిరిగి ఓపెన్ చేయాలని అనుకుంటే ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.ఇదిలా ఉండగా.. జనవరి మొదటి వారంలో RRR, సంక్రాంతికి రాధేశ్యామ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే కరెక్ట్ గా RRR, రాధేశ్యామ్ సినిమాల టైంకి థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. అదీగాక ఇంతవరకు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ముగ్గురూ ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాగే మెగాస్టార్ చిరు జగన్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఎన్టీఆర్ కి వల్లభనేని వంశీ, ఏపీ మంత్రి కొడాలి నాని మంచి స్నేహితులు.. అందువల్ల ఎన్టీఆర్ ఎప్పుడు ప్రభుత్వం పై స్పందించలేదు. ఇక ప్రభాస్ ఇప్పటివరకు రాజకీయాల జోలికి వెళ్లలేదు. కాబట్టి వీరి ముగ్గురికి జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని.. అందుకే ఈ ముగ్గురి సినిమాల టైంకి జగన్ థియేటర్లకు పర్మిషన్ ఇచ్చాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.