లైగర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరు రీసౌండింగ్ వస్తోంది. ఆగస్టు 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా ప్రస్తతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ సెంటిమెంట్‌తో వస్తున్న రౌడీ హీరో ఏ మేర ప్రభావం చూపిస్తాడో అంటూ అంతా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గకుండా దేశవ్యాప్తంగా విపరీతంగా తిరిగేశారు.
తెలుగులో కూడా ఈ సినిమాపై ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ నిర్వహించారు. నార్త్ లో కూడా విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ చూసి అంతా నోరెళ్లబెట్టారు. బాలీవుడ్‌లో కొంత వ్యతిరేకత ఉన్నా కూడా ఈ సినిమా ఓవర్‌కమ్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుడా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి రూ.90 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
విజయ్ దేవరకొండ- పూరీ- అనన్య పాండే- మైక్ టైసన్ అందరి చరిష్మా ముందు అదేం పెద్ద టార్గెట్ కాదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి స్టార్ హీరోయిన్, స్వీటీ అనుష్క విషెస్ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లైగర్ సినిమా సూపర్ సక్సెస్ కావాలంటూ ఈ అమ్మడు ఆకాంక్షించింది. అంతేకాకుండా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పింది.
‘జగ్గు దాదా, చార్మీ, విజయ్, అనన్య పాండే, లైగర్ సినిమా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే అనుష్క పూరీ జగన్నాథ్‌ని జగ్గూ దాదా అని పిలవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. జగ్గూ దాదా అనే పేరు ఎందుకు పెట్టింది? ఆ పేరు వెనక ఏమైనా స్టోరీ ఉందా అంటూ ఆలోచిస్తున్నారు. పూరీ సూపర్ సినిమాతో వెండితెరకు స్వీటీ పరిచయమైన విషయం తెలిసిందే. లైగర్ టీమ్‌కు అనుష్క విషెస్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.