సాధారణంగా హీరోయిన్లు పెళ్లయిపోయిన తర్వాత చాలా మారిపోతారు. అది అందంలో కావొచ్చు, యాక్టింగ్ లో కావొచ్చు ముందులా పెద్దగా జోష్ చూపించరు. కానీ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మాత్రం అస్సలు తగ్గట్లేదు. పెళ్లి, ఆ తర్వాత కొన్నాళ్లకు పాప పుట్టేసరికి.. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో కాస్త సైలెంట్ గా ఉన్న అనుష్క.. ఇప్పుడు మాత్రం రెచ్చిపోయింది. ఇన్ స్టాలో ఫొటోస్ షేర్ చేసి, నెటిజన్స్, అభిమానుల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ హీరోయిన్ గా అనుష్క శర్మ తెలుసు. ‘రబ్ నే బనాదే జోడీ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోలతో నటించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసింది. ఇక ఓ యాడ్ షూట్ సందర్భంగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి పనిచేసింది. అప్పుడు మొదలైన వీరి పరిచయం, కొన్నాళ్లకు స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. 2017లో ఒక్కటైన ఈ జంటకు.. గతేడాది జనవరిలో ‘వామిక’ పుట్టింది. ఇక కూతురు పుట్టిన తర్వాత సినిమాలకు టెంపరరీ బ్రేక్ ఇచ్చింది.
ప్రస్తుతం కూతురు ఆలనపాలన చూసుకుంటున్న అనుష్క.. మరోవైపు తన సినిమాలు, ఫిట్ నెస్ పై కూడా దృష్టి పెట్టింది. మెరుపు తీగలా మారిపోయింది. ఆమెని చూస్తే కుర్రహీరోయిన్లు కూడా కుళ్లుకోవడం గ్యారంటీ. అలా స్పోర్ట్స్ వేర్ లో తాజాగా తీసుకున్న కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ప్రెజెంట్ టీమిండియా మహిళా బౌలర్ ఝలాన్ గోస్వామి బయోపిక్ ‘చక్ దే ఎక్స్ ప్రెస్’ లో అనుష్క లీడ్ రోల్ చేస్తుంది. వచ్చే ఏడాది థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ఇక ఫిట్ నెస్ విషయంలో భర్తకి, గ్లామర్ లో సహ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉన్న అనుష్క లేటేస్ట్ ఫొటోస్ చూస్తే మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.