విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ.. ఈ జోడికి భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విరాట్ వరల్డ్ క్రికెట్ లో తనదైన ఆటతో దూసుకెళ్తుంటే.. అనుష్క బాలీవుడ్ సినిమాల్లో రాణిస్తోంది. ప్రస్తుతం అనుష్క శర్మ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి సినిమాలకు సంబంధించిన విషయంలో కాకుండా.. మరో విషయంలో వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల క్రితం అనుష్కకు పన్ను రికవరీ కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులను పంపించింది. అందుకు సంబంధించిన నోటీసులను సవాల్ చేస్తూ.. తాజాగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ భార్యగా దేశ వ్యాప్తంగా పరిచయమే. అయితే అంతకంటే ముందుగానే సినీ ప్రియులకు సుపరిచితురాలు అనుష్క. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న క్రమంలోనే కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుష్క శర్మ. ప్రస్తుతం ఓ లీగల్ కేసులో భాగంగా ముంబై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అనుష్క. అసలు విషయం ఏంటంటే.. 2012-13, 2013-14 సంవత్సరాలకు సంబంధించిన పన్ను రికవరీ కోసం.. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులను అనుష్కకు పంపించింది. గతంలోనే ఈ కేసును విచారించిన కోర్టు.. అనుష్క శర్మపై సీరియస్ అయ్యింది. ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా పిటీషన్ ను దాఖలు చేయడం తాము ఇంతవరకు చూడలేదని, డైరెక్ట్ గా పిటీషన్ ఎందుకు దాఖలు చేయలేదని.. అనుష్క శర్మ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు.
దాంతో అనుష్క శర్మ స్వయంగా కోర్టుకు హాజరై కొత్త పిటీషన్ ను దాఖలు చేసింది. రకరకాల సందర్భాల్లో ప్రొడ్యూసర్స్, ఈవెంట్ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నటిగా మూవీతో పాటుగా కొన్నిఅవార్డు ఫంక్షన్స్ లల్లో పాల్గొంటాను. అలాగని నిర్మాతలకు విధిస్తున్న శ్లాబుల్లో పన్ను చెల్లించాలి అంటే ఎలాగని అనుష్క శర్మ ప్రశ్నించారు. ఇక నటులకు వర్తించే శ్లాబుల్లోనే పన్నులు వేయాలి అని పిటిషన్ లో అనుష్క శర్మ పేర్కొన్నారు. ఇక ఆదాయ శాఖ వారు అనుష్క కు 2012-13లో రూ. 1.2 కోట్ల వడ్డీతో కలిపి రూ. 12.3 కోట్లుగా నిర్ణయించగా.. 2013-14 సంవత్సరానికి గాను దాదాపుగా రూ. 17 కోట్ల విక్రయ పన్ను రూ. 1.6 కోట్లుగా ఉంది.