ఓ స్టార్ బుల్లితెర నటి తాను బాడీ షేమింగ్ కు గురైయ్యానని, నా ఏజ్ పై కూడా ట్రోల్స్ చేశారని, లావుగా ఉన్నవాని పలు రకాలుగా నాపై విమర్శలు చేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకి బాడీ షేమింగ్ కు గురైన ఆ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే నటీ, నటులు తొలి రోజుల్లో ఎన్నో చీత్కారాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అవకాశాల కోసం పరిశ్రమలో తిరిగే టైమ్ లో అవమానాలు, కమిట్ మెంట్ లాంటి చేదు సంఘటనలను కొంత మంది ఎదుర్కొనే ఉంటారు. ఇక ఎక్కువగా మహిళా నటులే ఇండస్ట్రీలో చేదు సంఘటనలు ఎదుర్కొంటూంటారు. తాజాగా ఓ స్టార్ బుల్లితెర నటి తాను బాడీ షేమింగ్ కు గురైయ్యానని, నా ఏజ్ పై కూడా ట్రోల్స్ చేశారని, లావుగా ఉన్నవాని పలు రకాలుగా నాపై విమర్శలు చేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకి బాడీ షేమింగ్ కు గురైన ఆ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ టీవీ షో ‘అనుపమ’తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది రూపాలీ గంగూలీ. ఇక బాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటుగా ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఇంతటి ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఒకానొక దశలో తాను కూడా బాడీ షేమింగ్ కు గురైనట్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ లో ఎదురైన సంఘటనలను వివరించింది. ఈ ఇంటర్వ్యూలో రూపాలీ గంగూలీ మాట్లాడుతూ..
“నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన అనుపమ షో తర్వాత కూడా నేను బాడీ షేమింగ్ కు గురైయ్యను. నన్ను మీ శరీరంపై ముడతలు కనిపిస్తున్నాయి, లావుగా ఉన్నారు అంటూ ఎగతాళి చేశారు. ఇక తన భర్త కంటే తాను పెద్ద దాన్ని అనే విషయంలో నాపై ట్రోల్స్ వచ్చాయి” అంటూ తన జీవతంలో ఎదురైన చేదు సంఘటనలను వివరించింది. ఇక తన భర్త కంటే నేను నాలుగేళ్లు పెద్దదాన్ని అని, ఈ విషయంలో నేను గర్వపడుతున్నట్లు రూపాలీ చెప్పుకొచ్చింది. ఇక మేం ఈ షోలో భార్యా, భర్తల పాత్రలు మాత్రమే పోషించామని, నా పాత్రకు నేను వంద శాతం న్యాయం చేశాను అని రూపాలీ పేర్కొంది. మరి సెలబ్రిటీ అయ్యాక కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.