అనుపమ పరమేశ్వరన్.. మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ ఈమె. ఆమెను తెలుగు హీరోయిన్ గానే ట్రీట్ చేస్తుంటారు. కెరీర్ తెలినాళ్లలో మంచి హిట్లు అందుకున్న ఈ అమ్మడు తర్వాత కాస్త డల్ అయ్యింది. ఇప్పుడు కార్తికేయ 2 సినిమాలో మళ్లీ హిట్ ట్రాక్‌లో పడింది. కార్తికేయ 2 సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా రిలీజ్‌కు ముందు నుంచి అనుపమ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ చేసిన ఈ టీమ్.. రిలీజ్ తర్వాత నార్త్ వైపు సక్సెస్ మీట్లు అంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఒకవైపు వేరే సినిమాలు షూటింగ్స్ లో పాల్గొంటూనే ఇటు ప్రమేషన్స్, సక్సెస్ మీట్స్ అంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చింది.
ఎంతో మంది అభిమానులను కలవడం, వారితో కలిసి ముచ్చటించడం, వారి సినిమాని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడంలో అనుపమ కూడా తన వంతు కృషి చేసింది. అయితే ఇలా తీరిక లేకుండా గడపడం, సరైన నిద్ర, ఆహారం లేకపోవడం ఒకటి, వివిధ ప్రాంతాల్లో తిరగడంతో ఆమెకు ఎక్కడో కరోనా సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. అనుపమ ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.