అనుపమ పరమేశ్వరన్.. ‘అఆ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. కెరీర్లో ఎన్నో క్యూట్ రోల్స్ చేసిన అనుపమ ఇటీవల రౌడీబాయ్స్ చిత్రంలో కాస్త బోల్డ్ పాత్రలోనూ కనిపించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. 18 పేజెస్, కార్తికేయ 2, బటర్ ఫ్లై.. సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అనుపమ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నా.. తన పర్సనల్ లైఫ్ గురించి అంతగా ఫ్యాన్స్ తో పంచుకోదు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏకంగా తన ప్రేమ విషయాన్ని, తన పెళ్లి విషయంపై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అనుపమ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించింది. మీపై వచ్చే మీమ్స్ చూస్తుంటారా? అని అడగ్గా.. ‘నేను పక్క వారిపై వచ్చే మీమ్స్ చూసి కొంచం శాడిస్టిక్ ఆనందం పొందుతుంటాను. కొన్నిసార్లు నాపై వచ్చే మీమ్స్, కామెంట్స్ కూడా చూస్తుంటాను. అల్లం బెల్లం అనుపమ నా పెళ్లాం, రేయ్ బామర్ది నీ అక్క జాగ్రత్త.. ఇలాంటివి చూసి నవ్వుకున్నాను. నా తమ్ముడు అయితే ఆ మీమ్స్ చూసి నా బర్త్ డేకి కూడా పోస్ట్ పెట్టనని అలిగాడు’ అంటూ చెప్పుకొచ్చింది.
అనుపమ సింగిల్.. రెడీ టూ మింగిల్? అని అడగ్గా.. ‘నేను సింగిలా.. లవ్ లో ఉన్నానా.. నా రిలేషన్ పై నాకే క్లారిటీ లేదు. రిలేషన్ అనేది వన్ సైడ్ కూడా ఉండచ్చు కదా. నేను మాత్రం ప్రేమలో ఉన్నా.. మరి అవతలి వాళ్లు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ప్రస్తుతానికి నాది వన్ సైడ్ లవ్ అని మాత్రం చెప్పగలను’ అంటూ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చేసింది.
లవ్ మ్యారేజ్ పై కూడా అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. తనకు లవ్ మ్యారేజ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని చూస్తే భలే ముచ్చటేస్తుందంటూ చెప్పుకొచ్చింది. తనకి ప్రేమ వివాహం చేసుకోవాలని ఉందన్న విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసంట. ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానంటూ కుండ బద్దలు కొట్టేసింది. ప్రేమ, పెళ్లిపై అనుపమ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.