క్యూటిఫుల్ లుక్స్‌తో, కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరి మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈ ముగ్ధ మనోహరం నటించిన మూవీ కార్తికేయ 2. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, చందూ మొండేటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శర్వానంద్‌తో కలిసి ఈమె నటించిన మూవీ శతమానం భవతి రిలీజ్ రోజున ఈ సినిమా చూడకుండా వేరే సినిమా చూశారట. అది కూడా శర్వానంద్‌తో కలిసి.
ఆరోజు రాత్రి శర్వానంద్, అనుపమ ఇద్దరూ కలిసి ఆ సినిమా చూసి వచ్చారట. ఇంతకే ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? మన బాస్ కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150. నిజానికి ఆరోజు శతమానం భవతి సినిమా రిలీజైనా గానీ చిరు మీద ఉన్న క్యూరియాసిటీతో ఆ సినిమాకి వెళ్లారట. తనకి ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి అని, తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా ఖైదీ నంబర్ 150 అని అన్నారు. ఆరోజు శతమానం భవతి సినిమా రిలీజ్ ఉన్నా కూడా చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా చూశామని, శర్వానంద్‌తో కలిసి ఆరోజు రాత్రి ఆ సినిమాకి వెళ్ళానని ఆమె అన్నారు. శర్వానంద్‌కి చిరంజీవి అంటే చాలా ఇష్టం కాబట్టి వెళ్లామని, ఆరోజు తమతో పాటు అనుపమ తల్లి కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు.
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ కాబట్టి ఇండస్ట్రీకది ఎగ్జైటింగ్ మూమెంట్ అని అన్నారు. శతమానం భవతి సినిమా 2017 జనవరి 14న రిలీజ్ కాగా, అదే ఇయర్ జనవరి 11న ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయ్యింది. జనవరి 14న తాను నటించిన సినిమా రిలీజ్ అయినప్పటికీ చిరంజీవి మీద అభిమానంతో ఖైదీ నంబర్ 150 సినిమాకి వెళ్ళారట. అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో సంధ్య థియేటర్‌లో చూశానని, ఈ సినిమా కోసం బుర్కా వేసుకుని మరీ వెళ్లానని ఆమె అన్నారు. మరి మన మెగాస్టార్ కోసం తన సినిమాని పక్కన పెట్టిన అనుపమ, శర్వానంద్‌లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.