నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అను ఇమ్మానుయేల్. అను ముందుగా గోపిచంద్ ఆక్సిజన్ సినిమాకు సైన్ చేసింది. కానీ మజ్ను ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సాధించిన విజయంతో.. తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో యాక్ట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలేవి అను కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. ఇక తాజాగా ఊర్వశివో రాక్షసివో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిందీ చిత్రం. ఇక మూవీ ప్రమోషన్స్ సందర్భంగా అను ఇమ్మానుయేల్ ఓ ఆసక్తికర విషయం చెప్పింది. ఆ వివరాలు..
ఈ సందర్భంగా అను ఇమ్మాన్యయేల్ మాట్లాడుతూ.. ‘‘ఊర్వశివో.. రాక్షసివో సినిమా షూటింగ్ సమయంలో నేను, అల్లు శిరీష్‌లు డేటింగ్‌లో ఉన్నామంటూ వార్తలు వచ్చాయి. కెరీర్ ప్రారంభంలో అయితే ఇలాంటి వార్తలు చూసి నేను బాధపడేదాన్ని. కానీ రాను రాను అలవాటయ్యింది. పట్టించుకోవడం మానేశాను. కానీ ఈ వార్త చదివి మా అమ్మ చాలా బాధపడింది. అసలు వాస్తవానికి ఈ మూవీ ముందు వరకు అల్లు శిరీష్‌ని నేను కలవలేదు. ఊర్వశివో రాక్షసివో మూవీ ఓపెనింగ్ రోజు పూజలోనే మొదటిసారి అల్లు శిరీష్‌ని కలిశాను. ఆ తర్వాత కథా చర్చల్లో భాగంగా ఓ కాఫీ షాప్‌లో కూర్చుని మాట్లాడుకున్నాం అంతే. దానికే మేం ఇద్దరం డేటింగ్‌లో ఉన్నామంటూ వార్తలు పుట్టుకొచ్చాయి’’ అని అను ఇమ్మానుయేల్ గుర్తు చేసుకుంది.
‘‘నాకు అల్లు కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది. గతంలో నేను అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ సినిమాలో నటించాను. అప్పటి నుంచి వారంతా నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక అల్లు శిరీష్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ వచ్చిన వార్తల గురించి అల్లు అరవింద్ నన్ను డైరెక్ట్‌గా అడిగారు. ‘నా కొడుకు అల్లు శిరీష్‌తో డేటింగ్‌లో ఉన్నావా?’ అని అడిగారు. ఆ తర్వాత ఆ గాసిప్ గురించి ఇద్దరం చాలా సేపు నవ్వుకున్నాం’’ అంటూ అను ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చింది.