ఒక ప్రముఖ నిర్మాత కూతురు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ రొమాంటిక్ ఫొటోను అందరితో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మిగిలిన వివరాలు..
బాలీవుడ్ బడా నిర్మాతల్లో బోనీకపూర్ ఒకరు. అతిలోక సుందరి శ్రీదేవి భర్తగానే మనకు బోనీకపూర్ తెలుసు. కానీ ఉత్తరాదిన ఆయనకు నిర్మాతగా మంచి పేరుంది. సోదరుడు అనిల్ కపూర్ హీరోగా ఆయన ఎన్నో హిట్ చిత్రాలను తీశారు. అలాగే కుమారుడు అర్జున్ కపూర్‌తోనూ కొన్ని విజయవంతమైన సినిమాలు తీశారు. ఇప్పుడు దక్షిణాది వైపు దృష్టి సారిస్తున్నారు. తమిళ స్టార్ అజిత్‌తో ‘వలిమై’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించారు బోనీ కపూర్. సౌత్ స్టార్స్‌తో మరిన్ని సినిమాలు తీసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. బోనీకపూర్ కూతురు, హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ ప్రేమలో పడింది. స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌తో ఆమె డేటింగ్లో ఉన్నట్లు కొన్నాళ్లుగా బీటౌన్‌లో జోరుగా వినిపిస్తోంది.
తాజాగా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అన్షులా ఒక ఫొటో షేర్ చేసింది. ప్రియుడితో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఒక రొమాంటిక్ ఫొటోను అన్షులా సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటోకు హార్ట్ ఎమోజీతో 366 అని క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్నట్లు లొకేషన్ ట్యాగ్‌ను కూడా యాడ్ చేయడం గమనార్హం. దీంతో అన్షులా-రోహన్‌ల జంటకు విషెస్ చెబుతూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో త్వరలో అన్షులా-రోహన్‌లు పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బాలీవుడ్ టాక్. కాగా, శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడిన బోనీ కపూర్‌కు అంతకుముందే మోనా కపూర్‌తో వివాహమైంది. మొదటి భార్య సంతానమే అర్జున్ కపూర్, అన్షులా కపూర్.