సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏదో ఒక కారణంతో ఈ జంట వివాదంలో ఇరుకుంటున్నారు. ఆ మధ్య పెళ్ళైన సందర్భంగా ఈ జంట తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే తిరుమాడ వీధుల్లో ఈ జంట ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ సమయంలో నయనతార పాదరక్షలు ధరించి ఉండడం వివాదానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు రావడంతో ఈ జంట క్షమాపణ చెప్పుకొచ్చింది. అంతటితో ఈ వివాదం ముగిసిందనుకుంటే సరోగసీతో మరో వివాదం ఈ జంటకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. సరోగసీ విధానం ఎప్పుడో నిషేధించారని, అది చట్ట విరుద్ధమని విమర్శలు వచ్చాయి.
వీరి మీద చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ కూడా వేశారు. అయితే సరోగసీ విషయంలో నయనతార, విఘ్నేష్ శివన్ ల తప్పు లేదని, చట్టబద్ధంగానే ఈ సరోగసీ విధానాన్ని అవలంభించారని విచారణ కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఈ జంటకు ఉపశమనం లభించింది. ఇక ఏ సమస్యలూ లేవు, హ్యాపీగా బతకచ్చు అనుకుంటున్న తరుణంలో మరో సమస్య వీరిని వెంటాడుతోందన్న వార్తలు వస్తున్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరూ పెళ్ళికి ముందు కొన్నాళ్ళు సహజీవనం చేశారన్న వార్తలు వచ్చాయి. గతంలో ఈ ఇద్దరూ సౌదీలో కొన్ని వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారన్న కథనాలు వస్తున్నాయి. ఆ సమయంలో ఈ ఇద్దరికీ పెళ్లి అవ్వలేదని అగ్రిమెంట్ లో సంతకం చేశారట.
అయితే ఇటీవల కవల పిల్లల విషయంలో వివాదం రేగడంతో ఆరేళ్ళ ముందే పెళ్లి చేసుకున్నామని ప్రభుత్వానికి మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించారు. అదే ఇప్పుడు వీళ్ళకి లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిందని వార్తలు వస్తున్నాయి. సౌదీలో పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లో తమకి పెళ్లి కాలేదని సంతకం చేసినట్టు డాక్యుమెంట్లు నిరూపిస్తున్నాయని.. సౌదీలో తమకి పెళ్లి అవ్వలేదని, ఇక్కడ పెళ్లి అయ్యిందని తమిళనాడు ప్రభుత్వానికి చెప్పడం పట్ల నయనతారకు కొత్త సమస్య వచ్చిందని పుకార్లు వస్తున్నాయి. ఈ విషయంలో లీగల్ గా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఆరు నెలల ముందే నిజంగా పెళ్లి అయి ఉంటే సౌదీలో పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లో సెపరేట్ అని సంతకం ఎందుకు చేశారన్న ప్రశ్నలు ప్రభుత్వం నుంచి తలెత్తే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతన్నది తెలియాల్సి ఉంది.