నీలి చిత్రాల వ్యవహారంలో ఇప్పటికే కటకటాల్లో పాలయ్యారు శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా. ఇక ఆయనకు దీని నుంచి తెలుకోక ముందే మరో షాక్ తగిలింది. గతంలో సత్యయుగ్ గోల్డ్ బంగారు పథకంలో సచిన్ జోష్ ను మోసం చేశారని ఆరోపిస్తూ ఈ ఏడాది జనవరిలో వీరిపై సచిన్ కేసు పెట్టాడు. ఇక తాజాగా న్యాయస్థానం శిల్పా శెట్టి దంపతులకు వ్యతికరేకంగా తీర్పును వెలువరుస్తూ కోర్టు షాక్ ఇచ్చింది. దీంతో సచిన్ జోష్ కి చెందాల్సిన కిలో బంగారాన్ని అప్పగించింది. ఇదే కాకుండా కోర్టు ఖర్చుల క్రింద మూడు రూ.3 లక్షల రూపాయలను చెల్లించాలని ముంబై హైకోర్టు రాజ్‌కుంద్రాకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక కోర్టు తీర్పుపై సచిన్ జోష్ స్పందిస్తూ.. ‘6 సంవత్సరాల నుండీ ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుని అన్యాయంగా దోచుకోవాలని ప్రయత్నం తెలిపారు. రూ.18 లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వడానికి కుంద్రా సంస్థ రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఇక నా లాంటి వాళ్ళు బాధితులు చాల మంది ఉన్నారని, మీరు చేసిన అన్యాయాలపై కోర్టు సరైన తీర్పును వెలువరించిందని అన్నారు. నా సొమ్మును ఇవ్వమని అడిగితే నావైపే అన్యాయంగా వ్యవహరించారని సచిన్ తెలిపారు.
ఇలాంటి వాటిల్లో మీరు చేసిన పాపాలు ఎక్కడికి పోతాయని, భవిష్యతులో సరైన శిక్ష అనుభవించక తప్పదని సచ్చిన జోష్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే నీలి చిత్రాలు చిత్రికరిస్తున్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నతరుణంలోనే ఇలాంటి తీర్పు రావడం అనేది శిల్పా శెట్టి దంపతులకు మరో షాకింగ్ విషయమనే చెప్పాలి. ఇక ముందు ముందు వీరికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో చూడాలి మరి.