నీ పరిశ్రమలో అనిరుధ్ రవిచందర్ పేరు తెలియని వారు ఉండరు. తమిళంతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తూ.. సంగీత ప్రపంచంలో ‘అనిరుధ్ అనేది పేరు కాదు బ్రాండ్’ అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సినీ పరిశ్రమలో అనిరుధ్ రవిచందర్ పేరు తెలియని వారు ఉండరు. తమిళంతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తూ.. సంగీత ప్రపంచంలో ‘అనిరుధ్ అనేది పేరు కాదు బ్రాండ్’ అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నుంచి పాట వచ్చిందంటే చాలు అది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ‘వై దిస్ కొలవెరి సాంగ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 20 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి గట్టి పోటీ ఇచ్చాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ కి సంగీతమందించాడు కానీ ఆ సినిమా అనుకున్నా స్థాయిలో ఆడకపోయినా.. పాటలు మాత్రం సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల శివల ‘దేవర’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అతనే.
టాలెంటెడ్ మ్యుజీషియన్‌గా మంచి పేరు సంపాదించుకున్న అనిరుధ్.. ఇండస్ట్రీలో నటీమణులతో రిలేషన్స్ మెయింటెన్ చేస్తుంటాడనే వార్తలు గతంలోనూ నెట్టింట చక్కర్లు కొట్టాయి. సింగర్ కమ్ యాక్ట్రెస్ ఆండ్రియాతో డీప్ లిప్ లాక్ పెట్టుకున్న ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫోటో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. కొత్తగా అనిరుధ్ చుట్టూ మరో వివాదం రేగుతుంది. అదేంటంటే దళపతి విజయ్ ‘బీస్ట్’ మూవీలో ‘అరబిక్ కుత్తు’ సాంగ్ పాడి మంచి పేరు సంపాదించుకున్న సింగర్ జోనిత గాంధీతో అనిరుధ్ లవ్ ఎఫైర్ నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారని టాక్.
కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా నుండే ఈ జంట ప్రేమాయణం మొదలెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రేమ పావురాలు పెళ్లి కూడా చేసుకుంటారని తమిళ తంబీలు అనుకుంటున్నారు. దీని గురించి వార్తలు వైరల్ అవుతున్నా.. అనిరుధ్, జోనితా ఇద్దరిలో ఎవరూ రెస్పాండ్ కాలేదు. అలాగని ఈ వార్తలు నిజమేనా? అంటే చెప్పలేం. ఈ న్యూస్ ఇప్పటికే చాలా వైరల్ అవుతుంది, కాబట్టి ఓ ట్వీట్ లేదా కామెంట్ పెట్టి ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటూ అనిరుధ్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. మరీ ఈ జోడిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలపండి.