ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఇంట్లో విషాదం నెలకొంది. అనిరుధ్ తాత ఎస్వీ రమణన్(87) తుదిశ్వాస విడిచారు. వయసు భారం, అనారోగ్యం సమస్యల కారణంగానే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం.. 1930, 1940లలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక రమణన్.. రేడియోలో వేలాది కార్యక్రమాలకు డబ్బింగ్ చెప్పారు. దర్శకుడిగా లఘ చిత్రాలు రూపొందించారు. భక్తిరస డాక్యుమెంటరీలని చిత్రీకరించారు.
1983లో రమణన్.. ‘ఊరువంగల్ మరాళం’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో మహేంద్రన్, సుహాసిని హీరోహీరోయిన్లుగా నటించగా.. స్టార్ హీరోలు కమల్ హాన్, రజనీకాంత్.. అతిథి పాత్రల్లో కనిపించారు. ఇకపోతే రమణన్.. తమిళ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా రమణన్ కి ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ, పార్వతి ఉన్నారు. లక్ష్మీ కుమారుడే యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్. తాత మరణించడంతో అనిరుధ్ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. తాత వారసత్వాన్ని అందుకున్న అనిరుధ్.. సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ, ఫుల్ బిజీగా మారిపోయారు.
ఇదీ చదవండి:సూర్యకు వాచీ, లోకేష్‌కు కారు..మరి అనిరుథ్‌కు కమల్ గిఫ్ట్ ఏం ఇచ్చారు?..