సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ కమెడియన్ అల్లు రమేష్ మృతి చెందిన సంగతి విదితమే. నిన్న మాలీవుడ్ ప్రముఖ నటుడు మమ్ముట్టి తల్లి మరణించారు. తాజాగా ప్రముఖ నిర్మాత ఇంట విషాదం నెలకొంది
సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ కమెడియన్ అల్లు రమేష్ మృతి చెందిన సంగతి విదితమే. నిన్న మాలీవుడ్ ప్రముఖ నటుడు మమ్ముట్టి తల్లి మరణించారు. తాజాగా ప్రముఖ నిర్మాత ఇంట విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన పెద్ద నాన్న సుంకర బసవరావు శనివారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అనిల్ సుంకర విజయానికి ఆయన పెద్దనాన్న బాటలు వేసినట్లు చెప్పి ఎమోషనల్ ట్వీట్ చేశారు.
‘నన్ను ఎంతగానో ప్రేమించి, అన్ని రకాలుగా ప్రోత్సహించి, నా విజయానికి బాటలు వేసిన వ్యక్తైన నా పెద్దనాన్న ఇక లేరన్న వార్తతో తెల్లారింది. ఇన్సోవేషన్స్‌ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాము. ఎంచుకున్న రంగంలో కష్టపడి సక్సెస్ సాధిస్తూ మీరు గర్వించేలా చేస్తాం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి’అంటూ ట్వీట్ చేశారు. ‘బిందాస్’ చిత్రంతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన అనిల్ సుంకర 14 రీల్స్ సంస్థతో కలిసి దూకుడు, ఆగడు, లెజెండ్, రాజుగారి గది, కృష్ణగాడి వీర ప్రేమగాధ వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మించిన ‘ఏజెంట్’ విడుదలకు సిద్ధమైంది. చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Woke up this morning with a news that my dear pedananna Sunkara Basava rao garu, who loved me encouraged me and always looked farward for my success is no more. He lived all his life encouraging innovation. REST IN PEACE pedanannagaru. We will always miss you but work hard to… pic.twitter.com/FFCkZvNWDF
— Anil Sunkara (@AnilSunkara1) April 22, 2023