తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడుస్తున్నారు. అక్కినేని నాగార్జున నట వారసులుగా నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య కెరీర్ పరంగా పరవాలేదు అనిపించుకుంటున్నారు. కానీ అఖిల్ మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అయితే ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మంచి విజయం అందుకుంది.
అఖిల్ అక్కినేని ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’గా అఖిల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ నిర్మాత అక్కినేని అభిమానులకు నిర్మాత అనిల్ సుంకర క్షమాపణలు చెప్పారు. ‘అక్కినేని ఫ్యాన్స్ కు సారీ’ అంటూ ఆయన ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు.
అకిల్ అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా ఏజెంట్ టీజర్ రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని..అక్కినేని అభిమానుల, ఆడియన్స్ తమను అర్ధం చేసుకోగలరని భావిస్తున్నట్లు నిర్మాత అనిల్ సుంకర సారీ చెబుతూ వివరణ ఇచ్చారు.
Happiest birthday to our AGENT @AkhilAkkineni8 . Wishing you the best of the best year ahead with lots of success and stardom. Your dedicated efforts and always friendly nature with best attitude will make a place for you in the everest of film industry. pic.twitter.com/C3Dz5jhpZT
— Anil Sunkara (@AnilSunkara1) April 7, 2022