అనిఖా సురేంద్రన్ తన రెండో సినిమాలోనే లిప్‌లాక్‌లో నటించారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. 18 ఏళ్ల వయసుకే లిప్‌లాక్ ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల్లో హీరో, హీరోయిన్ మధ్య సన్నిహిత సీన్లు రావటం సర్వసాధారణం. హగ్గులు, లిప్‌లాక్ వంటి సీన్లు ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయాయి. హీరో,హీరోయిన్లు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఇలాంటి సీన్లకు ఓకే చెప్పేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు కూడా లిప్‌లాక్ సీన్ల విషయంలో ఎలాంటి ముహమాటం చెప్పటం లేదు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కావచ్చు.. స్టార్ హీరోయిన్లు కావచ్చు.. కథను బట్టి అలాంటి సీన్లలో నటిస్తున్నామని చెబుతున్నారు. కొందరు మొదటి సినిమాలోనే లిప్‌లాక్‌కు ఓకే చెబుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న అనిఖా సురేంద్రన్ కూడా తన రెండో సినిమాలోనే లిప్ లాక్ సీన్‌లో నటించారు.
18 ఏళ్లకు.. అది కూడా రెండో సినిమాలో లిప్‌లాక్ సీన్‌లో నటించటంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. తాజాగా, ఈ లిప్‌లాక్ వివాదంపై ఆమె స్పందించారు. ఆమె నటించిన ఓ మై డార్లింగ్ చిత్ర విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె చిత్ర ప్రమోషన్స్‌లో బిజీబిజీగా పాల్గొంటున్నారు. ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిప్‌లాక్‌పై మాట్లాడారు.. కథ డిమాండ్ చేసినందుకే లిప్‌లాక్‌కు ఒప్పు కోవాల్సి వచ్చిందని అన్నారు. అందుకు వయసుతో సంబంధంలేదని అన్నారు. కథ అవసరం అయినవి చేయటంలో తప్పులేదని పేర్కొన్నారు. కాగా, అనిఖా ‘ఛోటా ముంబై’ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండి తెరకు పరిచయం అయ్యారు.
మలయాళంలో పలు సినిమాలు చేశారు. ఎన్నై అరిందాల్ సినిమాతో తమిళ తెరకు పరిచయం అయింది. తమిళంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసింది. బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా మలయాళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక, ఆమె నటించిన ఓ మై డార్లింగ్, లవ్‌ఫుల్లీ యువర్ వేదా, పీటీ సార్, వసువిన్ గర్భిణిగల్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి, కథ డిమాండ్ చేసిన కారణంగానే లిప్‌లాక్‌కు ఒప్పుకున్నానన్న అనిఖా సురేంద్రన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.