ఒకప్పుడు హీరోయిన్‌లు ప్రయోగాలు చేయడానికి భయపడేవారు. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. తర్వాత అవకాశాలు వస్తాయో రావో అని ఆలోచించి.. కొన్ని రకాల పాత్రలకు ఓకే చెప్పేవారు కాదు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. పాత్ర డిమాండ్ మేరకు ఏం చేయడానికి అయినా రెడీ అంటున్నారు. ఆఖరికి నగ్నంగా కనిపించడానికి కూడా వెనకాడటం లేదు. గతంలో ‘ఆమె’ సినిమాలో అమలా పాల్ ఇలా ప్రయోగం చేయగా.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఈ జాబితాలో చేరింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: RK Roja: చిరంజీవిని కలిసిన రోజా.. కుటుంబంతో కలిసి మెగా ఫ్యామిలీతో సందడి!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ తాజా చిత్రం పిశాచి 2. 2014 లో వచ్చిన పిశాచి చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పార్ట్ 1 భారీ విజయం సాధించడంతో.. పార్ట్ 2ని విజయ్ సేతుపతి, పూర్ణ, ఆండ్రియా వంటా భారీ తారాగణంతో తెరకెక్కించాడు మిస్కిన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.. అరణ్మనై అరణ్మనై 2 చిత్రాల్లో నటించిన ప్రేక్షకుల్ని తనదైన నటనతో భయపెట్టిన ఆండ్రియా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో 15 నిమిషాల నిడివితో ఉండే ఓ సీన్‌లో ఆండ్రియా న్యూడ్‌గా నటించినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Yash: KGF తో మారిన యశ్ జీవితం.. సంపాదన డబుల్
కథ డిమాండ్ మేరకు 15 నిమిషాల పాటు వివిస్త్రగా నటించాలని దర్శకుడు కోరగా, తొలుత ఆండ్రియా అందుకు నిరాకరించినట్లు సమాచారం. కానీ కథ కోసం ఆమె న్యూడ్‌గా నటించిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలియనుంది. గతంలోనూ ఆండ్రియా ‘వడ చెన్నై’ చిత్రంలో బోటులో చిత్రీకరించిన సన్నివేశాల్లో వివస్త్రగా నటించింది. అయితే ఆ తర్వాత ఆ సీన్స్‌ను తొలగించారు. ఇక తాజాగా రిలీజైన టీజర్ ఇలా సాగింది.
ఇవి కూడా చదవండి: Swetha Varma: బిగ్‌బాస్ బ్యూటీ శ్వేత వర్మకి చేదు అనుభవం! ఎమోషనల్ పోస్ట్!
ఒక ఊరి చివరన ఉండే ఇల్లు.. ఆ ఇంట్లో పూర్ణ కుటుంబంతో కలిసి ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఇక ఆ ఇంట్లో ఉండే పిశాచి పిల్లలకు కనిపిస్తూ ఉంటూ ఇంట్లో సమస్యలను తెస్తోంది. ఆ పిశాచి నుంచి కుటుంబాన్ని కాపాడడానికి విజయ్ సేతుపతి ప్రయత్నిస్తూ ఉంటాడు. అస్సలు ఆండ్రియా పిశాచిలా ఎందుకు మారింది..? ఆ కుటుంబాన్ని ఎందుకు హింసిస్తుంది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక టీజర్ తోనే మిస్కిన్ భయపెట్టాడని చెప్పాలి. ఇకపోతే తెలుగులో ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పిశాచి లానే ఈ పిశాచి 2 కూడా హిట్ టాక్ అందుకుంటుందేమో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.