తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త భామలు వస్తూనే ఉంటారు. వీరిలో హీరోయిన్లు చాలామంది ఉంటారు. నార్త్ నుంచి మాత్రమే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ప్రతి ఏటా పదుల సంఖ్యలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. వీరు తొలి సినిమాలతో హిట్ కొట్టినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం సక్సెస్ ని కొనసాగించలేకపోతారు. కెరీర్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక చివరగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోతారు. ఇప్పుడు కూడా అలానే చాలారోజుల తర్వాత ఓ హీరోయిన్.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న భామ పేరు గౌరీ పండిట్. ఇలా చెబితే తెలియకపోవచ్చు గానీ ‘ఆంధ్రుడు’ హీరోయిన్ అంటే మాత్రం మన ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాతోనే గౌరీ, హీరోయిన్ గా పరిచయమైంది. యాక్టింగ్ తో పాటు గ్లామర్ విషయంలోనూ ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ‘ఆంధ్రుడు’తో బ్లాక్ బస్టర్ కొట్టిన గౌరీ.. ఆ తర్వాత కూడా తెలుగులో కాస్కో, ఆకాశ రామన్న, నిత్య పెళ్లికొడుకు, రాజేంద్ర లాంటి సినిమాలు చేసింది. కానీ 2012లో రిలీజైన హౌస్ ఫుల్ మూవీ తర్వాత మాత్రం పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.
ఇక గౌరీ వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే.. దిల్లీలో పుట్టిన ఈ భామ మోడల్ గా పేరు తెచ్చుకుని ఆ తర్వాత నటిగా మారింది. 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కాస్తో కూస్తో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. తాజాగా గౌరీ, తన కొడుకుతో తీసుకున్న ఫొటో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. సరే ఇదంతా పక్కనబెడితే గౌరీ పండిట్ అప్పటి-ఇప్పటి ఫొటోలు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.