యాంకర్ విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. గత నెలలో అమ్మ చనిపోవడంతో ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేకపోతోంది. తాజాగా మరోసారి భావోద్వేగానికి లోనైంది.
యాంకర్ విష్ణుప్రియ ఇంకా ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. అసలు పెద్దగా పోస్టులు పెట్టడం లేదు. బయట కూడా ఎక్కడా కనిపించడం లేదు. అమ్మ ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందనే బాధ నుంచి విష్ణుప్రియ కోలుకోలేకపోతుంది. ప్రతి క్షణం అమ్మని తలుచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెని గుర్తుచేసుకుంటూ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసి నెటిజన్స్ కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు ప్రేక్షకులకు విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. సుడిగాలి సుధీర్ తో కలిసి ‘పోరాపోవే’ షోకు యాంకర్ గా చేసింది. అక్కడి నుంచి ఈమె టీవీ జర్నీ షురూ అయింది. అలా డిఫరెంట్ ఛానెల్స్ లో యాంకరింగ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆల్బమ్ సాంగ్స్ లోనూ తనదైన మార్క్ చూపించింది. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉంటుంది.
విష్ణుప్రియకు అమ్మ- ఓ చెల్లెలు ఉన్నారు. అప్పుడప్పుడు వీళ్లు కూడా విష్ణుప్రియ ఇన్ స్టా పోస్టుల్లో కనిపిస్తూ ఉంటారు. అయితే జనవరి 26న ఆమె తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విష్ణుప్రియ.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత నుంచి అస్సలు యాక్టివ్ గా లేని.. ఈ బ్యూటీ తాజాగా అమ్మ బర్త్ డే సందర్భంగా మరోసారి ఎమోషనల్ అయింది. ‘అమ్మ హ్యాపీ బర్త్ డే. నీ ప్రేమ, ఎనర్జీని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు. ఎప్పటికీ ఐ లవ్ యూ’ అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.