ఉదయభాను ఒకప్పుడు బుల్లితెరను ఏలిన యాంకర్. గంభీరమైన వాయిస్ తో ఎన్నో అద్బుతమైన ప్రోగ్రామ్స్ కి తనదైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది యాంకర్ ఉదయభాను.
యాంకర్ ఉదయభాను తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. బుల్లితెరపై యాంకరింగ్‌కు అర్థం చెప్పిన తారామణి. ఉదయభాను ని చూసి నేర్చుకొని ఆమెను చూసి ఫాలో అయిన యాంకర్లు చాలా మంది ఉన్నారు. వెండితెరపై పలు సినిమాల్లో మెప్పించిన ఉదయ భాను.. తర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. పలు సీరియల్స్ లో నటించిన ఆమె తర్వాత బుల్లి తెరపై టివీ షోలకు యాంకర్ గా పరిమితమైంది. ఆమె అందం తరగని నిధి. బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్న ఉదయభాను స్టైలే వేరు అబ్బా. చారడేసి కళ్లు… ఆరడుగుల అందాల బొమ్మ.. చూడగానే అందరికి ఆకట్టుగానే అందమైన భామ, ఒకప్పుడు మాత్రం టీవిలో, డాన్స్ షోలో ఆమె తప్ప ఇంకెవరు యాంకర్ కనిపించేది కాదు. తాజాాగా ఉదయభాను హూంటూర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
తెలంగాణ యాసలో గల గల మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది యాంకర్ ఉదయభాను. ఒకప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న యాంకర్ తనే కావడం విశేషం. ఉదయభాను బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా అలరించింది. కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాటల్లో అలరించింది. అప్పట్లో బుల్లితెరపై రాణిగా ఒక్క వెలుగు వెలిగిన ఉదయభాను పెళ్లి తర్వాత ఒకదశలో ఆమె కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది. ఉదయభాను మంచి కెరీర్ లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ అనే వ్యక్తి తో ప్రేమలో పడింది. కొన్నాళ్ల తర్వాతనే పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరూ కుమార్తెలు కవలలుగా పుట్టారు. వీరిలో ఒకరు పేరు భూమి ఆరాధ్య, ఇంకొకరి పేరు యూవీ నక్షత్ర. ఆమె చాలా కాలం కెమెరాకు ధూరంగా ఉన్న ఉదయభాను.
ఇటీవల యాంకర్ గా బుల్లితెరపై మళ్లీ అడుగు పెట్టింది. ప్రస్తుతం ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్స్, షోలు చేస్తుంది.ఇటు కేవలం షోస్ మాత్రమే కాకుండా సొంతంగా యూట్యూబ్ చానల్ ను నిర్వహిస్తుంది.ఆమె తో పాటు తన కుటుంబసభ్యులకు సంబంధించిన విషయాలను కూడా ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవలే తాజాగా తాను కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే హోంటూర్ వీడియోను రీలీజ్ చేయగా విశాలవంతమైన గదులతో, చూడటానికి రిచ్ లుక్ లో ఇల్లు అదిరిపోయేలాగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా… అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.