ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. అయితే ఇటీవలే విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతోంది. గత రెండు రోజుల నుంచి హౌస్ ఫుల్ షోలతో థియేటర్ లో బన్నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఊ అంటావా మావ ఉ.. ఉ.. అంటావా మావా అనే ఐటెమ్ సాంగ్ వరుస వివాదాలతో నడుస్తుంది. సాంగ్ విడుదలైన కొన్ని రోజులకే లిరిక్స్ పై పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని కొందరు అల్లరి అల్లరి చేశారు.
ఇది సద్దుమణగకముందే మరో వివాదం రాజుకుంది. ఇటీవల పుష్ప సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా ఐటెమ్ సాంగ్ గురించి ఈ సినిమా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కాస్త వివరించే ప్రయత్నం చేశాడు. అలా మాట్లాడుతున్న క్రమంలో ఐటెమ్ సాంగ్ ని భక్తి పాటతో పోల్చాడు. దీంతో వెంటనే హిందు సంఘాలన్నీ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇక దేవీ శ్రీ ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యల పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం స్పందించి వార్నింగ్ ఇచ్చేంత పనిచేశాడు. ఇక తాజాగా బీజేపీ మహిళా అధ్యక్షురాలు, యాంకర్ శ్వేతా రెడ్డి సైతం స్పందించి పరుష పదజాలంతో దేవీ శ్రీ ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విరుచుకపడింది.
తప్ప తాగి తల్లికి, చెల్లికి, దేవుడికి, ఐటమ్ గర్ల్‌కి తేడా తెలియదరా ముండ మోపి ముండా కొడకా అంటూ ఫైర్ అయింది.‘‘దేవిశ్రీ ప్రసాద్ అనే చెత్త మ్యూజిక్ డైరెక్టర్ ‘పుష్ప’ సినిమా ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఈ ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా ఊహూ అంటావా’ అనే చెత్త సాంగ్ గురించి మాట్లాడాడు. ‘నాకు దేవుళ్ల సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ ఒకటే.. దేవుళ్ల సాంగ్స్‌ని ఎట్లా స్మరిస్తానో.. ఐటమ్ సాంగ్స్‌ని కూడా అట్లే స్మరిస్తాను, ఆ రెండు సాంగ్స్‌కి పెద్ద తేడా లేదు నాకు రెండు ఒకటే.. నాకేం పెద్ద తేడా అనిపించదు’ అని ఈ చెత్తగాడు చెత్త వాగుడు వాగాడు. ఇక ఐటమ్ సాంగ్ లకు దేవుళ్లని లాగుతారా అంటూ ప్రశ్నించింది శ్వేతా రెడ్డి.
తెలుగు చిత్ర పరిశ్రమలో సుకుమారు ఒకరు డిసెంట్ డైరెక్టర్. కనీసం నువ్వైన చెప్పాలి కదా అంటూ ఆయనకు కూడా చురకల అంటించింది. ఇక ఈ విషమం గురించి ఢిల్లీ స్థాయిలో మాట్లాడుకుంటాన్నారని, నాకు పై రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ వెంటనే మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ శ్వేతారెడ్డి వాపోయింది. ఒకవేళ క్షమాపణలు చెప్పకుంటే దేవీ శ్రీ ప్రసాద్ ని హిందూ సంఘాలు తరమి తరిమి కొడతాయని యాంకర్ శ్వేతా రెడ్డి దేవీ శ్రీ ప్రసాద్ కి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా శ్వేతా రెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. శ్వేతారెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.