సమ చేతికి సంకెళ్లు ఉన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ సుమ చేతికి సంకెళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఏం జరిగిందో సరిగ్గా తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
తెలుగులో టాప్ యాంకర్ ఎవరని.. చిన్న పిల్లలను అడిగినా సరే.. ఠక్కున ‘సుమక్క’ అని చెప్పేస్తారు. అంతలా తన యాంకరింగ్ స్కిల్స్‌తో దశాబ్ధాలుగా టాప్‌లో కొనసాగుతున్నారామె. వాస్తవానికి ఆమె మాతృభాష మలయాళం అయినా.. మలయాళాన్ని మించి తెలుగును ఒంట బట్టించుకున్నారు. తెలుగు వారిని మించి పంచులు, ప్రాసలతో తన షోలను ఎక్కడా బోర్ కొట్టించకుండా చూసుకుంటున్నారు. టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా ఈవెంట్ జరిగినా అక్కడ సుమే కనిపిస్తున్నారు.
ఎప్పుడూ సినిమా ఈవెంట్లు, టీవీ షోలు చేసుకుంటూ బిజీబిజీగా ఉండే సుమ చేతికి సంకెళ్లు పడ్డాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇంతకీ సుమకు ఏం జరిగింది? సుమ చేతికి ఆ సంకెళ్లు ఏంటి? అని ఆ ఫొటో చూస్తున్న నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి, సుమ అరెస్ట్ అయ్యారా? లేక ఏదైనా కారణం ఉందా? ఆమె చేతికి సంకెళ్లు ఉండటానికి కారణం ఏంటో తెలియక ఆమె ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. అయితే, సుమ నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్ల కోసం ఈ విధంగా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
సుమ ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్ కోసం ఈ విధంగా చేతికి సంకెళ్లతో కనిపించారా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? అన్నది తెలియరాలేదు. కాగా, నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటిస్తున్న కస్టడీ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మే 12న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. మరి, యాంకర్ సుమ కనకాల చేతికి సంకెళ్లు ఉండటానికి గల కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.