యంకర్ సుమ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేదిక ఏదైన తన మాటలతో గారడి చేసే బుల్లితెర యాంకర్ సుమ. టెవిలిజన్ కార్యక్రమాలు, సినిమా వేడుకలు.. ఇలా వేదిక ఏదైనా తనదైన శైలిలో అలరిస్తూ ఉంటుంది. ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో వెండితెరకి పరిచయమైన విషయం తెలిసిందే. ‘పవిత్ర ప్రేమ’, ‘చాలా బాగుంది’, ‘వర్షం’, ‘ఢీ’, ‘బాద్‌షా’ తదితర చిత్రాల్లో నటించారు. రాజీవ్ కనకాలతో వివాహం జరిగిన తర్వాత ఆమె బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ సుమ 8 ఏళ్ల తర్వాత తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయింది.
తాజాగా సుమ రీఎంట్రీ చిత్రానికి సంబంధించిన వీడియోని రామ్ చరణ్ విడుదల చేశారు. ‘ప్రతీ తెలుగువారు ఎంతగానే అభిమానించే సుమ గారికి అభినందనలు. మీరు వెండితెరను హిట్ చేసే టైం వచ్చేసింది’ అంటూ.. రామ్ చరణ్ జయమ్మ పంచాయతీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిపై స్పందించిన యాంయర్ సుమ.. రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, పోస్టర్‌లో సుమ చాలా సీరియస్‌గా పెద్ద బాధ్యతని మోసేలా కనిపిస్తుంది.
ఈ పోస్టర్‌లో సుమ ఎర్రని చీరలో బాహుబలిలో శివగామిలా కనిపిస్తోంది. రోలు దంచుతున్న స్టైల్‌లో సుమ కనిపించగా.. ఆమె చీర కొంగుపై…. ఊరికి సంబంధించిన జనం, ఆ ఊరి పరిస్థితులు, పోలీస్ స్టేషన్, ఓ గుడి పక్కనే ఓ వేప చెట్టు.. ఆ చెట్టుకు వేలాడుతూ ముగ్గురు వ్యక్తులు కనిపించారు. సుమ రోలు దంచగానే.. రోలు కూడా బద్దలయ్యేలా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తయారు చేశారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయ్ కలివరపు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.
Suma garu, you’ve been the most loved name in every Telugu household.Time to hit the 70mm screen
Here’s the Title & First Look Motion Poster of #JayammaPanchayathi@ItsSumaKanakala https://t.co/TgbzeuMADy
Best wishes to the team!
— Ram Charan (@AlwaysRamCharan) November 6, 2021
Here’s the Title & FL Motion Poster of#JayammaPanchayathi
Launched by MEGA POWER🌟 @AlwaysRamCharan
An @mmkeeravaani Musical@VijayKalivarapu @Anushkumar04 #BalagaPrakash @vennelacreation
— Suma Kanakala (@ItsSumaKanakala) November 6, 2021