బుల్లితెర యాంకర్ గా సుమకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాటల పుట్ట.. సమయస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. ఇక తన షోలకు వచ్చే గెస్ట్ లను మాటలు, పంచ్ లతో ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. ఇక సుమ వేసే పంచ్ లకు కౌంటర్ ఇవ్వడం అంత తేలిక కాదు. డైలాగ్ తోనే అవతలి వారి నోరు మూయిస్తుంది. అయితే అప్పుడప్పుడు సుమ వేసే పంచ్ లు కూడా మిస్ ఫైర్ అయి.. అది కాస్త వివాదానికి దారి తీస్తాయి. తాజాగా క్యాష్ షోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుమ కామేడీగా అన్నా సరే.. తోటి యాంకర్ అనసూయ పరువు తీసేసింది. ఆ వివరాలు..
ఈ శనివారం ప్రసారం కానున్న క్యాష్ షోకి లూజర్ టీం సభ్యులు ప్రియదర్శి, కల్పిక, అన్నీ, శశాంక్ గెస్ట్ లుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోలో షోకి వచ్చిన ప్రియదర్శిని సుమ తన బొమ్మ వేయమని చెప్తుంది. ప్రియదర్శి తనలో ఉన్న అద్భుత పటిమను బొమ్మ మీద ప్రదర్శించాడు. ఆ తర్వాత కళ్లు మూసుకుని ఎక్కడా అంటూ..పెయింటింగ్ దగ్గరకు వచ్చిన సుమ కళ్లు తెరిచి చూసి షాక్ అవుతుంది. వెంటనే సుమ బొమ్మ గీయమంటే.. పుష్పలో అనసూయ చేసిన దాక్షాయణి క్యారెక్టర్ బొమ్మ వేశావేంటి అని అడుగుతుంది. ఇలా తోటి యాంకర్ ని అవమానించడంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి పుష్ప మూవీ లో దాక్షాయణి గెటప్ మీద బోలెడు జోకులు, మీమ్స్ సోషల్ మీడియాలో నడస్తూనే ఉన్నాయి. ఈమధ్య సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా పుష్ప స్పూఫ్ చేసినప్పుడు దాక్షాయణి పాత్రతో ఆడుకున్నారు. హైపర్ ఆది మరీ శాంతి అనే లేడీ గెటప్ తో పోల్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అనసూయ మనసులో ఉడుక్కుంది తప్ప ఏమీ అనలేకపోయింది. మరి ఇప్పుడేమో మన అనుకున్న సుమ కూడా తనమీద సెటైర్లు వేస్తోంది. దీనిపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.