యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. తెలుగు బుల్లితెరపై తన మాటల మంత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది యాంకర్ సుమ. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటోంది. దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. త్వరలో వెండితెరపై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో “జయమ్మ పంచాయితీ” అనే సినిమా తెరకెక్కుతోంది.
ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేశారు. ఆ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. సుమ రోలు దంచగానే.. రోలు కూడా బద్దలయ్యేలా ఉన్న మూవీ మోషన్ పోస్టర్ బాగా బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ విజయ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా బలగా ప్రకాశ్ నిర్మిస్తున్నారు. అయితే చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న సుమ ప్రస్తుతం తన ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఈ సినిమా కోసం సుమ తన ఆహార్యంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జిమ్‌లో వర్కువుట్స్ చేస్తోంది. అందుకోసం స్పెషల్ ట్రైనర్‌ని నియమించుకుంది. ‘రెండు డంబెల్స్ ఎత్తిన తర్వాత నా చేతులు ఎంత బాధపడి ఉంటాయో వర్ణించలేను.. ఆపమంటాడేమో అని నా ట్రైనర్ రాహుల్ వైపు చూస్తూ ఉంటా.. కానీ అతను మాత్రం ఆ మాట చెప్పడు’ అని సుమ రాసుకొచ్చింది. ప్రస్తుతం యాంకర్ సుమ జిమ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.