కొన్నిసార్లు తమ గురించి వచ్చే రూమర్స్ విని విని విసుగెత్తిపోయి ఏదొక రోజు కోపాన్ని బయట పెట్టేస్తుంటారు సెలబ్రిటీలు. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా.. సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో ఎవరైనా లిమిట్స్ పాటిస్తే బాగుంటుందని వారు చెబుతుంటారు. అవును.. ఇటీవల స్టార్ యాంకర్ శ్రీముఖికి పెళ్లి కుదిరిందంటూ సోషల్ మీడియాలో కథనాలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అంతటితో ఆగకుండా శ్రీముఖికి ఫలానా వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అని, అతను హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మెన్ అని రూమర్స్ అక్కడా ఇక్కడ పాకి ఆఖరికి శ్రీముఖి చెవిన పడ్డాయి. దీంతో మ్యారేజ్ రూమర్స్ పై శ్రీముఖి చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.
శ్రీముఖి స్పందిస్తూ.. ‘ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటారు.. ఇంకోసారి పెళ్లి అంటారు. రీసెంట్ గా మా నాన్న ఫొటో బ్లర్ చేసి పెళ్లి రూమర్స్ స్ప్రెడ్ చేశారు.. మరీ ఇంత దారుణమా? రోజూ ఇలాంటి వార్తలు విని విసుగొస్తుంది. నా పెళ్లి ఇంకా మూడు, నాలుగేళ్ళ తర్వాతే చేసుకుంటా. అప్పుడు నేనే స్వయంగా ప్రకటిస్తాను. ఇప్పుడే నాకు పెళ్లి ఆలోచన లేదు.’ అని రూమర్లను కొట్టి పారేసింది. ఇక శ్రీముఖి ప్రెజెంట్ పూర్తిగా తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతినిండా టీవీ షోలతో పాటు పలు సినిమాలను కూడా లైనప్ చేసినట్లు సమాచారం. బ్యాక్ టు బ్యాక్ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది.
ఇదిలా ఉండగా.. ‘డాన్స్ ఐకాన్’,‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’,‘మిస్టర్ అండ్ మిసెస్’,‘సారంగ దరియా’ లాంటి షోలకు హోస్ట్ గా చేస్తోంది ఈ బుల్లితెర రాములమ్మ. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘భోళాశంకర్’లో కీలకపాత్ర పోషిస్తోంది. శ్రీముఖి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో తెలిసిందే. లైవ్ సెషన్స్, చాట్ సెషన్స్ తో ఫాలోయర్స్ ని.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్ తో నెటిజన్స్ ని ఖుషి చేస్తుంటుంది. మరి శ్రీముఖి పెళ్లి గురించి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైందని చెప్పాలి. మరి శ్రీముఖి గురించి.. ఆమె అందం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.