బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని గ్లామరస్ బ్యూటీలలో యాంకర్ శ్యామల ఒకరు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్యామల.. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఓవైపు టీవీ షోలలో, సినిమా ఈవెంట్స్ లో యాంకరింగ్ చేస్తూనే, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. ముఖ్యంగా గ్లామరస్ ఫోటోషూట్స్ తో శ్యామల.. సోషల్ మీడియా ఫాలోయింగ్ భీభత్సంగా క్రియేట్ చేసుకుంది.
ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ ఫాలోయింగ్ లో 1 మిలియన్ మార్క్ అందుకుంది. అయితే.. శ్యామల ఎలాగో యాంకర్ కాబట్టి టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ మాత్రమే చేస్తోందని అనుకుంటే పొరపాటే. ఖాళీ సమయం దొరికితే చాలు అటు ఫ్యామిలీతో, ఇటు ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లో కాలక్షేపం చేస్తుంటుంది. అదీగాక గ్లామర్ షోతో అభిమానులను ఆకట్టుకోవడం శ్యామలకు కొత్తకాదు.
తాజాగా శ్యామల పోస్ట్ చేసిన వీడియో ఆమె ఫాలోయింగ్ కి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ వీడియోలో శ్యామల అందంగా ముస్తాబు అవ్వడమే కాదు.. అందమైన చెవిపోగులు, ఆ చీరకట్టు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లేత పచ్చరంగు చీరలో శ్యామల అందాల షోతో పాటు తెలుగుదనం ఉట్టి పడుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి శ్యామలా లేటెస్ట్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.