తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యాంకర్ గా టీవీ ప్రేక్షకులకు దగ్గరైన శ్యామల.. నటిగా కూడా పలు సినిమాలలో మెరిసింది. అయితే.. నటిగా కంటే గ్లామరస్ యాంకర్ గానే సక్సెస్ అయ్యింది శ్యామల. ప్రస్తుతం సినిమా ఫంక్షన్స్ తో పాటు అడపాదడపా టీవీ షోలలో సందడి చేస్తోంది. కానీ గ్లామర్ షో విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గట్లేదు శ్యామల.
ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో శ్యామల అలా అందాలను ఎరగా వేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుండి కంప్లిమెంట్ అందుకొని వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్యామల.. కుర్రకారును తన అందమైన డాన్స్ స్కిల్స్ తో ఆకట్టుకుంటోంది. మిలియన్ కి పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ బ్యూటీ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ ధరించిన శ్యామల.. సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ మాస్ స్టెప్స్ తో ఇరగదీసిన ‘మమ్మ మహేశా..’ పాటకు అదిరిపోయే డాన్స్ చేసింది. శ్యామలకు ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఓ కొడుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆమె డాన్స్ వీడియోలు చూస్తే.. హీరోయిన్లను మించిన అందంతో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. మరి ప్రస్తుతం యాంకర్ శ్యామల డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.