టీవీ యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఓవైపు టీవీ షోలతో, సినిమా ఈవెంట్లతో పాటు మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎల్లప్పుడూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్యామల.. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లో పాల్గొంటుంది. ఇక ఇటీవల మరోసారి ‘కమాన్ లెట్స్ టాక్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చాట్ చేసింది.
ఈ క్రమంలో శ్యామలను చాలా ప్రశ్నలు అడిగిన నెటిజన్లు.. మధ్యలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఆర్జీవీ గురించి ఏమైనా చెప్పండి? అనే ప్రశ్నకు.. ‘నో కామెంట్స్.. ఆయన గ్రేట్ డైరెక్టర్.. అప్పట్లో ఆయన తీసిన సినిమాలకు పెద్ద అభిమానిని’ అంటూ సమాధానం పంపింది. ప్రస్తుతం శ్యామల ఆన్సర్ పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
గొప్ప డైరెక్టర్ అన్నారు బాగానే ఉంది కానీ.. ఒకప్పుడు తీసిన సినిమాలకు పెద్ద అభిమానిని అన్నారు. అంటే ఇప్పుడు వర్మ తీస్తున్న సినిమాలు నచ్చడం లేదా.. లేక ఆయన ప్రస్తుతం ఫామ్ లో లేడని ఇండైరెక్ట్ గా అన్నారా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు ఆర్జీవీ ఫ్యాన్స్. అలాగే ఇటీవలే కదా.. మిమ్మల్ని చాలా అందంగా ఉన్నారని.. ఇంతకాలం ఎందుకు కనిపించలేదని పొగిడాడు.. దానికి మీ సమాధానం ఇదేనా అంటున్నారు. ప్రస్తుతం శ్యామల చాట్, వర్మ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.