బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ కి సమయం దగ్గర పడుతోంది. షోని ప్రారంభించేందుకు బిగ్ బాస్ యాజమాన్యం కూడా సర్వత్రా సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇటీవలే సీజన్ 5 ముగించుకున్న బిగ్ బాస్ షో.. తొలిసారి ఓటీటీ వేదికపై ప్రేక్షకులకు అలరించనుంది. అయితే.. బిగ్ బాస్ ఓటిటి సీజన్ ప్రకటించినప్పటి నుండి ఈ షో పై, షోలో పాల్గొనే సెలబ్రిటీలపై, షో డేట్స్ గురించి సోషల్ మీడియాలో ఊహగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనబోయే సభ్యులకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సీజన్ 5లో పాల్గొన్న యాంకర్ రవి మరోసారి ఓటిటి సీజన్ లో పాల్గొంటాడని కొన్ని కథనాలు హల్చల్ చేశాయి. ఈ విషయం పై స్పందించిన రవి.. ఓటిటి ఫార్మాట్ లో తాను పాల్గొనడం లేదని, బిగ్ బాస్ షో నాకు చాలా నేర్పింది. అదీగాక కొన్ని కమిట్మెంట్స్ ఉండటం వలన తాను వెళ్లకపోవచ్చు. ఇంకెప్పుడైనా అవకాశం వస్తే ఆలోచిస్తా.. అని చెప్పినట్లు సమాచారం.ఇక బిగ్ బాస్ ఓటిటి ఫార్మాట్ ఇటీవలే తమిళంలో ప్రారంభమైంది. 24 గంటలు ప్రసారమవుతున్న ఈ ఓటిటి ఫార్మాట్ సక్సెస్ అవ్వడంతో తెలుగులో సన్నాహాలు ముమ్మరం చేశారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ ఓటిటి తెలుగు షో.. ఫిబ్రవరి 27న మొదలు కానుందని టాక్ నడుస్తుంది. అలాగే పలువురి పేర్లు కూడా షోలో పాల్గొంటారని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటికీ బిగ్ బాస్ యాజమాన్యం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ ఓటిటి ఫార్మాట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.