ప్రదీప్ మాచిరాజు.. ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎవరు ఉండరు. రేడియో జాకీగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ప్రదీప్.. అనంతరం బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన మాటలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపు సంపాందించాడు. బుల్లితెర యాంకర్స్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా పేరు సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. అయితే కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా వెండితెరపై పలు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రదీప్ యాంకర్ గా చేస్తున్న షోల్లో ఢీ ఒకటి. తెలుగు ప్రేక్షకులను మంచి ఎంటర్టైన్ మెంట్ తో కట్టిపడేస్తున్న షోల్లో ఇది ఒకటి. తాజాగా ఈ షోకు ప్రదీప్ గుడ్ బై చెప్పినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు బుల్లితెరపై డ్యాన్స్, కామెడీలతో అందరిని ఆకట్టుకుంటున్న షో ‘ఢీ’. ఇందులో ప్రదీప్ యాంకర్ గా తనదైన మాటలతో నవ్వుల పువ్వులు పూయిస్తారు. ఇక ఆది, సుడిగాలి సుధీర్ లతో ప్రదీప్ చేసే రచ్చ షో ని టాప్ లేవల్ కి తీసుకెళ్లింది. ఈక్రమంలో టాప్ రేటింగ్ లో దూసుకెళ్తున్న షోల్లో ఒకటిగా ఢీ షో నిలిచింది. ఇందులో జడ్జీలతో ప్రదీప్, సుధీర్ , ఆదిలు చేసే సందండి మాములుగా ఉండదు. వీళ్ల కామెడీ కోసమే ప్రత్యేకంగా ‘ఢీ’ షో చూసే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల ఈషో నుంచి సుధీర్ బయటకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ప్రదీప్ తనదైన పంచులతో షోలో సుధీర్ లేని లోటును భర్తీ చేస్తూ వచ్చాడు. సుడిగాలి సుధీర్ `శ్రీదేవి డ్రామా కంపనీ`కి యాంకర్ గా వ్యవహరించేవాడు. ఇటీవల ఆ షో నుంచి కూడా బయటికి వచ్చేశాడు. అతని స్థానంలో యాంకర్ రష్మీని రంగంలోకి దింపారు. అయితే సుధీర్ ఢీ షో నుంచి బయటకి వచ్చాకా మరోసారి ఆ షో గట్టి షాక్ తగిలింది.
ఈ షో నుంచి తాజాగా యాంకర్ ప్రదీప్ వెళ్లిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా అవకాశం రావడంతో మరొకసారి వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అందుకే ఢీ షో నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఢీ షోకు యాంకర్ ప్రదీప్ రూపంలో ఉన్న ఆ కాస్త కళ తప్పడం గ్యారెంటీ అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి.. ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేదు. ఇందులో నిజమైంత అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. మరి.. ఢీ షోకు ప్రదీప్ గుడ్ బై చెబుతున్నాడు అనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.