ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటున్నాయి. యాంకర్లు కొన్నిసార్లు అతి చేసి అభాసుపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ఆరంభించిన ‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోగా మారారు నాని. ఎప్పుడూ వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తూ నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని ‘దసరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దసరా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం నాని చెన్నై వెళ్లారు. పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా నానీతో ఓ యాంకర్ ఛాలెంజ్ చేసి ఎత్తిన బాటిల్ దించకుండా కూల్ డ్రింక్ తాగుదామని ప్రయత్నించి నవ్వులపాలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం హీరో నాని తాను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దసరా’ కోసం ప్రమోషన్ బిజీలో ఉన్నారు. తమిళ ఇండస్ట్రీలో రిలీజ్ చేస్తున్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చెన్నైకి వెళ్లి తన మూవీ ప్రమోషన్ లో భాగంగా వివిధ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో లిటిల్ టాక్స్ అనే ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో దసరా మూవీ ట్రైలర్ లో నాని మందు బాటిలో చేత్తో పట్టుకోకుండా నోటితో గడ గడా తాగే సీన్ గురించి ప్రస్తావించాడు. ఆ యాంకర్ అలా చేత్తో పట్టుకోకుండా ఎలా తాగారు అని ప్రశ్నించింది. మీకు ఇష్టమైతే ఆ సీన్ ఇక్కడ చేద్దామా అని యాంకర్ నానిని అడిగింది. నానీ ఓకే చెప్పడంతో రెండు కూల్ డ్రింగ్ బాటిల్స్ తెప్పించింది యాంకర్.
కూల్ డ్రింగ్ బాటిల్ తెచ్చాక నానికి ఒకటి ఇచ్చి తాను ఒక బాటిల్ తీసుకుంది యాంకర్. అయితే బాటిల్ నోట్లో పెట్టుకొని ఎలా తాగాలో యాంకర్ కి నాని తెలిపాడు. ఇక ఇద్దరూ బాటిల్స్ తీసి నోట్లో పెట్టుకున్నారు. తల పైకి ఎత్తేలోపు యాంకర్ ఒక్కసారే ఉక్కిరి బిక్కిరి అయ్యారు.. వెంటనే కూల్ డ్రింక్ వెల్లగక్కారు. బాబోయ్ తన వల్ల కాదని ఒప్పేసుకున్నారు. మూవీలో నాని బాటిల్ ఎత్తి తాగడం బాగా అలవాటు అయిపోవడంతో కూల్ డ్రింగ్ గడ గడా తాగారు. ఈ ఇంటర్వ్యూ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది యాంకర్ పై కామెడీ పంచ్ లు పడిపోయాయి.. మీమ్స్ తో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రాక్టిస్ చేస్తూ పరువు పోగొట్టుకోవడం ఎందుకు..? నానీ అన్నతో నీకు పోటీనా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Ee challenge lo @NameisNani anna ni odinche vaallu undaremo 🤣#Dasara #DasaraOnMarch30thpic.twitter.com/55iLsz1NLN
— Sahithi 💫 (@sahithi_18) March 10, 2023