అషురెడ్డి పేరు వినని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. బిగ్‌బాస్ షోలోకి కంటెస్టెంట్‌గా వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, గత కొద్ది రోజులనుంచి సోషల్ మీడియా వ్యాప్తంగా అషురెడ్డిపై విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఇందుకు కారణం దర్శకుడు ఆర్జీవీతో ఆమె చేసిన ఓ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆమెతో ఆర్జీవీ హద్దులు దాటి ప్రవర్తించారు. ఏకంగా అషురెడ్డి కాలిని ముద్దు పెట్టడమే కాకుండా నోట్లో కూడా పెట్టుకున్నారు ఆర్జీవీ. దీంతో ఆర్జీవీతో పాటు, అషురెడ్డిపై కొందరు నెటిజన్లు ట్రోలింగ్స్ చేయటం మొదలుపెట్టారు. దారుణంగా ఆమెను తిడుతున్నారు. అయితే, అషురెడ్డిని తిట్టిన నోళ్లే పొగిడే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త ట్రోలింగ్స్‌కు, ట్రోలర్స్‌కు గొడ్డలి పెట్టుగా మారింది.
ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఆమెలోని మంచి కోణాన్ని బయటపెట్టే వార్త. అషురెడ్డి తనకు తోచినంతలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె చాలా ఏళ్ల నుంచి కొంతమంది పిల్లలను చదివిస్తూ ఉన్నారు. ఆమె చదివిస్తున్న ఇద్దరు అమ్మాయిలు తమ బీటెక్ డిగ్రీని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అషురెడ్డి చెప్పుకొచ్చారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. అందులో.. ‘‘ క్రిస్మస్ రోజు శాంటా లాగా ఉండమని వాళ్లు చెప్పారు. నేను చాలా ఏళ్లనుంచి దేవుడు ఇచ్చిన నా పిల్లలకు చదువును అందిస్తూ ఉన్నాను.
ముఖ్యంగా కళ్యాణి, శ్రేయలకు సంబంధించి. వాళ్లు ఇప్పుడు తమ బీటెక్ డిగ్రీలను పూర్తి చేశారు. వారికి నా శుభాకాంక్షలు. మీరు నా జీవితంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను మీ ప్రేమను పొందేందుకు ఏమి చేశానో నాకు తెలియటం లేదు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు ఎవరితోనైనా దయగా ఉండాలనుకుంటే ఉండండి. ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండేందుకు దేవుడు మీకో దారిని చూపిస్తున్నాడు. ఆ అవకాశానికి కృతజ్ఞతలు. మీరు గనుక వారికి సహాయం చేయాలనుకుంటే చేయండి’’ అని పేర్కొన్నారు. ఇక, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ట్రోలింగ్స్ చేసే వారిపై మండిపడుతున్నారు. ఇప్పుడు పెట్టండ్రా బ్యాడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి గురించైనా తప్పుగా ప్రచారం చేసే ముందు అన్ని తెలుసుకోవాలని అంటున్నారు. అషురెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలతో ట్రోలర్స్ నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయింది. ఇకపై ఆమెపై ఏవైనా ట్రోలింగ్స్ చేసే ముందు ఓ సారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి, అషురెడ్డి గొప్పమనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.