సాధారణంగా సెలబ్రిటీలు తీరికలేకుండా షూటింగ్ లలో బిజీబిజీగా గడుపుతుంటారు. దాంతో వారికి రిలాక్స్ అయ్యే టైమ్ ఉండదు. ఇక ఎప్పుడో ఒక సారి వారికి కాస్తంత టైమ్ దొరికితే చాలు చిల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే వెకేషన్లకు వెళ్లి సరదాగా గడిపి వస్తుంటారు. ఇక వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం తరచూ చుస్తూనే ఉంటాం. అయితే తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయకు సంబంధించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చేతిలో మద్యం గ్లాస్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ భామ ఫోటోలు వైరల్ గా మారాయి.
యాంకర్ అనసూయ.. జబర్దస్త్ కామెడి షో ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఈ అమ్మడు అందంలోనే కాకుండా కాంట్రవర్సీల్లో కూడా టాపే. ఆ మధ్య ఆంటి అన్న వివాదంలో పోలీసు కేసు దాక వెళ్లింది అనసూయ. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన అనసూయ.. వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీబిజీగా ఉంది. అలాగే పలు ప్రత్యేక షోలకు యాంకర్ చేస్తుంది కూడా. ఇక ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటుంది. ఇక తాజాగా అనసూయ తన ఇన్ స్టా లో షేర్ చేసిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన స్నేహితురాళ్లతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది అనసూయ.
అక్కడ ఓ మద్యం గ్లాస్ ను చేతిలో పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలను తను పోస్ట్ చేసింది.”నిన్న ట్వాస్ వైన్ ఓ క్లాక్ కు వెళ్లాను. ఇక నేను వైన్ తో ఉన్నప్పుడు బాగానే ఉంటాను లేకపోతే ఉండను. మీకు వైన్ కలపడంలో మంచి అనుభవం ఉంది ఇలాగే వర్థిల్లండి శ్రీముఖి మేకల” అంటూ ఫోటో కింద రాసుకొచ్చింది. ఈ ఫోటో చూసిన అభిమానులు స్పందిస్తూ.. మీరు వైన్ ఒక్కటే తాగుతారా? లేక బీర్ కూడా తాగుతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళలు వైన్ తాగటం సర్వసాధారణమే అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ”రంగమార్తాండ” మూవీలో ఓ కీలకపాత్ర చేస్తుంది. అలాగే త్వరలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ”కన్యాశుల్కం” లో ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.