తెలుగు బుల్లితెర గ్లామర్ క్వీన్ అనగానే యాంకర్ అనసూయ ముందుగా గుర్తొస్తుంది. ఎల్లప్పుడూ ట్రెండ్ కి తగ్గట్టుగా తన లుక్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి రంగస్థలం మూవీలో నటించిన తర్వాత.. వరుస అవకాశాలను చేజిక్కిచ్చుకుంటోంది.
ఇటీవల పుష్ప, ఖిలాడీ సినిమాలలో ఆకట్టుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఆచార్యలో అనసూయ క్యారెక్టర్ గురించి ఓ వార్త సినీ వర్గాలలో వైరల్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమాలో అనసూయ రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని టాక్.
ఆచార్యలో అనసూయ కీలకపాత్రలో నటించినట్లు తెలుస్తుంది. అలాగే తన పాత్ర కోసం లుక్ పరంగా చాలా మేకోవర్ అయ్యిందట. అయితే.. అనసూయది కథలో కీలకమైన క్యారెక్టర్ అని, ఆ పాత్ర కోసం అనసూయకు 25 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారని సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా.. ఆచార్య సినిమాను కొణిదెల ప్రొడెక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే పాటలతో అంచనాలు పెంచేసిన ఆచార్య ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమాలో దేవదాసిగా కనిపించనుంది. మరి అనసూయ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.