ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటల్లో అనసూయ దంపతుల జంట ఒకటి. 2001లో ఈ జంట ప్రేమ కథ ఓ మలుపు తీసుకుంది. తర్వాతి కాలంలో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక, ఈ జూన్ 4న అనసూయ- సుశాంక్‌ల పెళ్లి వార్షికోత్సవం జరిగింది. ఈ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రెట్ చేసుకుంది ఈ జంట. వెకేషన్‌లో గడిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ అనసూయ హల్ చల్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తమ పెళ్లి ఫొటోలను కూడా షేర్ చేశారు.
ఆ పెళ్లి ఫొటోల్లో ఆమె ఎంతో అందంగా ఉన్నారు. పెళ్లి పీటలపై కుందనపు బొమ్మలా కూర్చుని అందరి మతి పోగొడుతున్నారు. ప్రస్తుతం ఆ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తూ.. అనసూయ అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా, నిన్న అనసూయ భర్త గురించి ఓ ఎమోషనల్ పోస్ట్‌పెట్టారు. ఆ పోస్టులో తమ ప్రేమ గురించి, వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాతి అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తనతో పాటు ఇన్నేళ్లుగా కలిసి సాగినందుకు భర్తకు కృతజ్ఞతలు చెప్పారు.
తన కోసం చాలా త్యాగాలు చేశావని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. తమ ప్రేమ దేవాలయానికి సుశాంక్ ఓ పిల్లర్‌లాగా నిలిచాడని అన్నారు. తామిద్దరం ఫర్‌ఫెక్ట్ జంట కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మూర్ఖులమని, కొన్ని సార్లు వింతవాళ్లమని, ఒకరితో ఒకరం చాలా దారుణంగా ఉంటామని అన్నారు. కొన్ని సార్లు ఒకరి కోసం ఒకరు నిలబడలేకపోయామని కూడా చెప్పుకొచ్చారు. మరి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనసూయ పెళ్లి నాటి ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.