తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు సినిమా తారల ఫోటోలు వారి నటిస్తున్న చిత్రం నుంచి లీకవుతూ ఉంటాయి. సహజంగా అందులోని సన్నివేశాలు, ఫైట్ సీన్స్ వంటివి కొందరు యూనిట్‌కు తెలియకుండా లీక్ చేస్తారు. తాజాగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అయిన విషయం తెలిసిందే. దీంతో పవన్, మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర స్ఠాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియాలో లెవల్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప. ఇందులోని యాంకర్ అనసూయ ఓ పాత్రలో నటిస్తోంది.
ఇక ఈ సినిమాలోని అనసూయ పాత్ర లుక్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు నెట్టింట్లో ఆ ఫోటో బాగా వైరల్‌గా మారింది. ఇందులో అనసూయ హెయిర్ స్టైల్ మార్చి సరికొత్త లుక్‌లో దర్శనమిస్తోంది. ఈ మూవీలో హీరో సునిల్‌కు భార్యగా అనసూయ నటిస్తుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇక మరి నిజంగానే ఈ ఫోటో పుష్ప సినిమాలోదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై. రవి శంకర్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సునీల్ శెట్టి, ఫహాద్ ఫాజిల్, బాబీ సింహా , జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక బారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.