అనసూయ జిమ్ లో కనిపించింది. భర్తతో కలిసి తెగ కష్టపడుతోంది. మధ్యలో గ్యాప్ దొరకడమే లేటు ఫొటోలకు పోజిలిచ్చింది. ఇంతకీ ఏంటి సంగతి?
తెలుగు యాంకర్స్ లో మిగతావాళ్ల సంగతేమో గానీ అనసూయకి డిఫరెంట్ క్రేజ్ ఉంది. అందరూ తమ టాలెంట్ తో ఫేమ్ తెచ్చుకుంటే.. ఈమె మాత్రం టాలెంట్ ప్లస్ పలు వివాదాలతో ఎప్పటికప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అంతెందుకు రీసెంట్ రౌడీ విజయ్ దేవరకొండపై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్స్ వేసింది. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. గత కొన్నాళ్ల నుంచి టీవీ షోలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సడన్ గా జిమ్ లో ప్రత్యక్షమైంది. కిరాక్ ఫొటోలతో ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఏంటి సంగతి?
అసలు విషయానికొస్తే.. అనసూయ భరద్వాజ్ ఓ సాధారణ న్యూస్ ప్రెజంటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె, ‘జబర్దస్త్’కి యాంకర్ గా మారింది. ఆ తర్వాత ఈమె లైఫే మారిపోయింది. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఈ షోకు హోస్టింగ్ చేసిన ఈ బ్యూటీ.. గతేడాది దానికి టాటా చెప్పేసింది. ప్రస్తుతం సినిమాలపై పూర్తి కాన్స్ ట్రేషన్ చేసింది. చిన్న పెద్దా సినిమాల్లో మంచి మంచి రోల్స్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. ‘పుష్ప 2’లోనూ దాక్షాయణిగా మరింత ఎంటర్ టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు సడన్ గా జిమ్ ఫొటోలు పెట్టింది. అది కూడా భర్త శశాంక్ భరద్వాజ్ తో కలిసి..
నార్మల్ గా అయితే అనసూయ జిమ్ ఫొటోలు పెట్టింది అనుకుని వదిలేస్తారు. ఇది జరగడానికి సరిగా రోజుల ముందు విజయ్ దేవరకొండపై ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేయడం, ఇప్పుడు ఫొటోలు పెట్టడం అంతా చూస్తుంటే.. అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తుందా అనిపిస్తోంది. ఏదేమైనా అనసూయ జిమ్ ఫొజులు మాత్రం కిరాక్ ఉన్నాయి. ఆమె మెడలో రుద్రాక్ష మాల ఉందేంటా అని నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. దాని గురించి అనసూయ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం బయటకురాదు. మరి అనసూయ జిమ్ ఫొజులు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.