తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యాంకర్ అనసూయ అంటే తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. బుల్లితెరపై యాంకర్ గా పలు షోల్లో బిజీగా ఉంటూనే.. వెండితెరపై వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇప్పటి వరకు ఏ యాంకర్ కి రాని క్రేజ్ అనసూయ దక్కించుకుంది.
ఒకదశంలో బుల్లితెరపై యాంకరింగ్ కి కొత్త భాష్యం చెప్పింది అనసూయ. తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయ్యింది అనసూయ.
ప్రస్తుతం అనసూయ నటిగా, యాంకర్ గా రెండు రంగాల్లో రాణిస్తు బిజీగా మారిపోయింది. అనసూయ సోషల్ మీడియా బాగా ఫాలో అవుతుంది. ఆమెకు సంబంధించిన ఫోటో షూట్స్, పర్సనల్ ఫోటోలు, ఏదైనా వెకేషన్ కి వెళ్తే దానికి సంబంధించి ఫోటోలు షేర్ చేస్తుంది. ఆమె వీడియోలు, ఫోటోలపై ఎవరైనా నెగిటీవ్ కామెంట్స్ చేస్తే ఘాటుగా స్పందిస్తుంది. అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు తెరలేపుతుంది.
ఇక అనసూయ కుటుంబం విషయానికి వస్తే.. ఆమె తండ్రి సుదర్శన్ ఒక వ్యాపార వేత్త.. వీరిది విశాఖ పట్నం. వాస్తవానికి అనసూయ చిన్ననాటి పేరు పవిత్ర. ఆమె తండ్రి తన తల్లిపై మక్కువతో ఆ పేరు మార్చి అనసూయగా పిలవడం మొదలు పెట్టారు. అలా నాయనమ్మ పేరు అనసూయకు పెట్టారు. చిన్నప్పటి నుంచి ఎంతో యాక్టీవ్ గా ఉండే అనసూయ ఎడ్యూకేషన్ లో కూడా ఫస్ట్. ఇంటర్ లో ఉండగానే ఎన్‌సీసీ క్యాంప్ లో సుశాంక్ భరద్వాజ్ ని కలిసింది. తర్వాత వీరిద్దరూ తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకొని 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు.. శౌర్య, అయాన్.
ఎం.బి.ఎ చేసిన అనసూయ ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. ఆ సమయంలో సినిమా ఛాన్సులు వచ్చినా.. ప్రముఖ ఛానల్ లో న్యూస్ రీడియర్ గా జాయిన్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు ఎంతో పాపులారిటీ సంపాదించిన జబర్ధస్త్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో అనసూయకు ఎక్కడ లేని క్రేజ్ రావడంతో వెండితెరపై అవకాశాలు వచ్చాయి. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నాగార్జునతో ఒక సాంగ్ లో నటించింది.
ఓ వైపు జబర్ధస్త్ లో యాంకర్ గా నటింస్తూనే పలు ఈవెంట్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది. ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా అందరిని అలరించింది. అల్లు అర్జున్ నటించిన పుష్ఫ చిత్రంలో మాస్ లుక్ తో నెగిటీవ్ షేడ్ లో కనిపించింది. ఇటీవల సినిమాల్లో ఆమెకు వరుస చాన్సులు రావడంతో యాంకరింగ్ పై ఫోకస్ తగ్గించింది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల జబర్ధస్త్ కామెడీ షో నుంచి తప్పుకుంది. కాకపోతే ఇతర ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తుంది. ఓ వైపు నటిగా మరోవైపు యాంకర్ గా తన సత్తా చాటుతున్న అనసూయ. ఒక సామాన్య కుటుంబం నుంచి ఇప్పుడు స్టార్ హూదాకు చేరుకుంది అనసూయ. తన యాంకరింగ్, నటనతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అనసూయ నటిగా మంచి సక్సెస్ అందుకుంటూంది.