యాంకర్ అనసూయ.. బుల్లితెర, వెండితెర రెండింటిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒక హీరో, హీరోయిన్ కు ఉండే ఫ్యాన్ బేస్ అనసూయ సొంతం. బుల్లితెరలో యాంకర్ గా షోలు, స్పెషల్ ఈవెంట్స్ చేస్తూనే.. అటు వెండితెరపై విలక్షణ కథలు, పాత్రలు ఎంచుకుని తనలోని నటిని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటుంది. ఒక రంగమ్మత్త పాత్రలో అమాయకంగా, దాక్షయాణి పాత్రలో నెగెటివ్ రోల్ లోనూ మెప్పించిన గొప్ప నటి అనసూయ. ఆమె పేరు మీద పదికిపైగా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయంటేనే అర్థమవుతుంది అనసూయ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అనేది. అనసూయ అటు సామాజిక సమస్యలపై కూడా తనదైనశైలిలో స్పందిస్తుంటుంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ నిత్యం తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. తన డైలీ యాక్టివిటీస్, తన లైఫ్ లోని స్పెషల్ మూమెంట్స్, క్రేజీ అప్డేట్స్ అన్నీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. తాజాగా అనసూయ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. యూట్యూబ్ లో సెన్సేషన్ గా నిలిచిన ‘ఎంజాయి ఎంజామీ వాంగా వాంగా ఎంజామీ’ అనే ప్రైవేట్ సాంగ్ తో వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవనే కాదు.. సాధారణంగా అనసూయ ఏ ఫొటో పెట్టినా వైరల్ అవుతూనే ఉంటుంది. అనసూయ ఫ్యామిలీ ట్రిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.