న్యూస్ రిపోర్టర్ స్థాయినుంచి ఎదిగి.. నటిగా సక్సెస్ సాధించారు అనసూయ. మరోవైపు యాంకర్‌గా కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం నటిగా మంచి, మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా, ఆమె తన పెళ్లి రోజును పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో భర్తతో వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చారు. ఆ పోస్టులో.. ‘‘ నువ్వు నాకు రాసిన ఫస్ట్ లవ్ లెటర్ నాకు గుర్తుంది. 2001, జనవరి 23లో న్యూఢిల్లీలోని ఆడిటోరియంలో నాకు లెటర్ ఇచ్చావు. నేను ఇంకా దానికి రిప్లై ఇవ్వలేదని అనుకుంటున్నాను.
అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. డియర్ నిక్కు. నువ్వు ఇన్నేళ్లుగా నాతో కలిసి సాగినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను. నాకోసం చాలా త్యాగాలు చేశావు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. మన ప్రేమ దేవాలయానికి నువ్వు ఓ పిల్లర్‌లాగా నిలిచావు. ఇప్పుడు మనం కలిసి ఎదుగుతున్నాం. ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావో నాకు అర్థంకాదు.. అదే సమయంలో నేను నిన్ను ఎలా భరించానో అర్థం కాదు. నేను నా జీవితాంతం చికాకు పెట్టాలనుకునే ఒకే ఒక వ్యక్తివి నువ్వే.
నాకు తెలుసు మనం ఫర్‌ఫెక్ట్ జంట కాదు. మనం ఇద్దరం మూర్ఖులం. కొన్ని సార్లు వింతవాళ్లం. ఒకరితో ఒకరం చాలా దారుణంగా ఉంటాం. కొన్ని సార్లు ఒకరి కోసం ఒకరం నిలబడలేకపోయాం. మన పెళ్లిని ఓ డేటింగ్ లాగా చేసిన నీకు థ్యాంక్స్. పెళ్లి రోజు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ఓ వీడియో ఆమె షేర్ చేశారు. ఆ వీడియో ఆమె తన భర్తతో డిన్నర్ డేట్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.