అనసూయ భరద్వాజ్.. అటు బుల్లితెర ఇటు వెండితెర రెండింట తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటోంది. అనసూయకు ఒక హీరోయిన్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సదేహం లేదు. ఆమె పేరు మీద పదికి పైగా సోషల్ మీడియా ఫ్యాన్ పేజ్ లు ఉన్నాయంటే.. ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనసూయకు ఫైర్ బ్రాండ్ అని కూడా పేరుంది. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటుంది. అంతేకాదు ట్రోలర్స్ కు కూడా తనదైనశైలిలో కౌంటర్లు ఇస్తుంటుంది.
ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. ట్రిప్పుకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా బీచ్ లో సరదాగా గడుపుతున్న ఫొటోలు షేర్ చేసింది. వైట్, గ్రీన్ డిజైన్ గౌన్ లో చెట్టుపై కూర్చుని నవ్వుతున్న అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల పుష్ప సినిమాలో నెగెటివ్ రోల్ తో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పుష్ప సీక్వెల్ లో దాక్షాయణి పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. పుష్ప-2లోనే కాకుండా పక్కా కమర్షియల్, రంగ మార్తాండ చిత్రాల్లోనూ అనసూయ నటిస్తోంది. అనసూయ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.