వాలెంటైన్స్ డే అందరికి స్పెషలే. పెళ్ళైన వారు భార్య/భర్తతో వాలెంటైన్ ని గిఫ్టులతో అయినా సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్.. వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి ఓ పిక్ షేర్ చేసి విష్ చేసింది. అదే పిక్ గురించి సోషల్ మీడియాలో ఓ నెటిజెన్ తో వాగ్వాదానికి దిగింది.
వాలెంటైన్స్ డే అందరికి స్పెషలే. సెలబ్రిటీస్ నుండి కామన్ పీపుల్ వరకూ అందరూ ఏదొక విధంగా లవర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలనే చూస్తుంటారు. సింగిల్స్ గురించి పక్కన పెడితే.. పెళ్ళైన వారు భార్య/భర్తతో వాలెంటైన్ ని గిఫ్టులతో అయినా సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది సెలబ్రిటీలు సీక్రెట్ గా జరుపుకోవచ్చు.. ఇంకొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టవచ్చు. కానీ.. లవర్స్ డే రోజున కూడా కాంట్రవర్సీ ద్వారా వార్తలలో నిలుస్తారని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేరు. తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్.. వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి ఓ పిక్ షేర్ చేసి విష్ చేసింది.
ఇప్పుడు అదే పిక్ గురించి సోషల్ మీడియాలో ఓ నెటిజెన్ తో వాగ్వాదానికి దిగింది అనసూయ. భర్తతో కలిసి దిగిన పిక్ షేర్ చేసి.. నీతో లైఫ్ చాలా క్రేజీ అని రాసుకొచ్చింది. దీనికి ఓ నెటిజెన్ రియాక్ట్ అవుతూ.. “అలా ఏం లేదు అక్క. వాడి దగ్గర డబ్బు ఉంది అందుకే..” అని కామెంట్ చేశాడు. ఇంకేముంది అనసూయ రంగంలోకి దిగి.. ఝలక్ ఇచ్చింది. నార్మల్ డేస్ లో అంటే ఊరుకునేదేమో.. కానీ, భర్తతో కలిసి వాలెంటైన్స్ డే రోజున పెట్టిన స్పెషల్ పిక్ పై కామెంట్ చేసేసరికి కౌంటర్ వేయకుండా ఊరుకోలేదు. ఏకంగా చెప్పుతో చెంపలపై కొట్టేస్తానని చెప్పకనే చెబుతూ కౌంటర్ వేసింది.
నెటిజెన్ కామెంట్ పై స్పందిస్తూ.. “అదేంట్రా తమ్ముడూ అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? నాకు లేదా మనీ మరి?. చెప్పు.. నీకన్నీ తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది. చెంపలేసుకో. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. నేను అంది చెంపలేస్తానని” అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఇక ఆ నెటిజెన్ కూడా అంతటితో ఊరుకోక.. “మీరు రియాలిటీని అర్థం చేసుకోవాలి. మీరు ఎన్ని చెప్పినా రియాలిటీ రియాలిటీనే..” అని కామెంట్లు చేశాడు. దీనిపై కూడా అనసూయ రిప్లై ఇచ్చింది.
‘నీ బొందరా నీ బొంద.. ముందు మాట్లాడటం నేర్చుకో. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా.. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ బుద్ధి మనీ ఒకటే కాబట్టి.. అందరిదీ అదే అనిపిస్తుంది. వీలైతే నీ బుద్ధి మార్చుకో.. గెట్ వెల్ సూన్.. తమ్ముడివి కదా మంచి, చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా” అని రిప్లైలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మరో నెటిజెన్ కూడా నెగిటివ్ కామెంట్ పెట్టేసరికి.. “నా ఇన్ స్టాగ్రామ్ లో నేను ఫోటో పెట్టుకుంటే నీకేం ప్రాబ్లెమ్ రా.. అయినా నచ్చకపోతే ఫాలో అవ్వడం ఎందుకు? దొబ్బెయ్” అని రిప్లై ఇచ్చి ఊరుకుంది. ప్రెసెంట్ అనసూయ నెటిజెన్స్ తో వాగ్వాదానికి దిగిన విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి అనసూయ రిప్లై ఇచ్చిన విధానంపై గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.