తెలుగు ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా ఎంతలా గ్లామర్ ఒలికిస్తుందో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటోంది. ఓవైపు టీవీ ప్రోగ్రాంలను, మరోవైపు సినిమాలతో బిజీగా ఉండే అనసూయ.. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ఎమోషనల్ అవుతుంది. తాజాగా శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో ప్రముఖ టీవీ ఛానల్ ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ అనే స్పెషల్ ప్రోగ్రాం అనౌన్స్ చేసింది.
ఈ క్రమంలో ఆ ప్రోగ్రాంకు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో అనసూయ తన భర్త గురించి మాట్లాడుతూ భావోద్వాగానికి గురైంది. నీ భర్త గురించి ఏదైనా చెప్పు అనే ప్రశ్నకు వెంటనే స్పందించిన అనసూయ.. “నేను ప్రతి రోజూ నా భర్తతో ప్రేమలో పడతాను. మా ఆయన అని కాదుగానీ.. అలాంటి భర్త ఈ ప్రపంచానికి చాలా అవసరం” అంటూ ఎమోషనల్ అయిపోయింది. ప్రస్తుతం అనసూయ కంటతడి పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి అనసూయ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.